Actress | “చచ్చిపోతావన్నారు, సందీప్ రెడ్డికి ఒక్క మేసేజ్ చేసా”.. తన ఆరోగ్య పోరాటంపై ఎమోష‌న‌ల్ కామెంట్స్

Actress | టాలీవుడ్ నటి గాయ‌త్రి గుప్తా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం, మానసిక సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణం గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు. చిన్నతనం నుంచి ప్రేమ, ఆప్యాయతలు దక్కకపోవడం వల్ల మానసిక గాయాలు ఎదురయ్యాయని, అదే తర్వాత తన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని ఆమె భావోద్వేగంగా చెప్పారు.

Actress | టాలీవుడ్ నటి గాయ‌త్రి గుప్తా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం, మానసిక సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణం గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు. చిన్నతనం నుంచి ప్రేమ, ఆప్యాయతలు దక్కకపోవడం వల్ల మానసిక గాయాలు ఎదురయ్యాయని, అదే తర్వాత తన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని ఆమె భావోద్వేగంగా చెప్పారు.

తనకు ఎప్పుడూ ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటే అని, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండేదాన్నని, యోగా ఛాంపియన్‌గా కూడా ఉన్నానని గాయత్రీ తెలిపారు. అయినప్పటికీ ఆరోగ్య సమస్యలు ఎందుకు వచ్చాయో అర్థం కాలేదని చెప్పారు. తీవ్ర మానసిక ఒత్తిడి, ట్రామా కారణంగా తన వెన్నెముక వంకరపోయిందని, ఆటో ఇమ్యూన్ సమస్యతో బాధపడినట్లు వెల్లడించారు.

రూ.2ల‌క్ష‌లు మాత్ర‌మే వ‌చ్చాయి..

ఈ సమస్యలతో వైద్యులను సంప్రదించినప్పుడు కూడా సరైన నిర్ధారణ చేయలేదని, “నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావ్” అంటూ నిర్లక్ష్యం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని తాను “మెడికల్ అబ్యూస్”గా భావిస్తున్నానని అన్నారు. మహిళల్లో కనిపించే అనేక ఆటో ఇమ్యూన్ సమస్యలకు సమాజంలో ఉన్న ఒత్తిడి, నిరాశ, భావోద్వేగ గాయాలే కారణమవుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.

చికిత్స కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గాయత్రీ వెల్లడించారు. తనకు చికిత్స కోసం సుమారు రూ.15 లక్షలు అవసరమయ్యాయని, అందుకే క్రౌడ్ ఫండింగ్‌ను ఆశ్రయించానని తెలిపారు. అయితే ప్రజల నుంచి కేవలం రూ.2 లక్షలు మాత్రమే వచ్చాయని చెప్పారు.

ద‌ర్శ‌కుడు అండ‌గా..

ఈ కష్ట సమయంలో దర్శకుడుసందీప్ రెడ్డి వంగా తనకు అండగా నిలిచారని గాయత్రీ తెలిపారు. తన పరిస్థితిని వివరించగా, వెంటనే స్పందించి మెడికల్ రిపోర్ట్స్ పంపమని అడిగారని చెప్పారు. అన్ని వివరాలు పంపిన తర్వాత వారం రోజుల్లోనే రూ.5.5 లక్షలు తన ఖాతాలో జమ చేశారని, ఆ డబ్బుతో బెంగళూరులో చికిత్స తీసుకున్నానని కృతజ్ఞతలు తెలిపారు. “ఫిదా సినిమా సమయంలో నుంచే ఆయన నాకు మంచి స్నేహితుడు” అని పేర్కొన్నారు.

తన చికిత్సలో భాగంగా యోగా, శ్వాసాభ్యాసాలు, ధ్యానం, ప్రాణాయామం వంటి పద్ధతులను పాటించినట్లు గాయత్రీ తెలిపారు. కుండలినీ అవేకనింగ్ ద్వారా లోపల దాగి ఉన్న మానసిక గాయాలను బయటకు తీసుకురాగలిగానని చెప్పారు. అలాగే పంచకర్మ చికిత్స తనకు ఎంతో ఉపశమనం ఇచ్చిందని, మళ్లీ బ్రతకగలననే నమ్మకం కలిగిందని వెల్లడించారు.

“వైద్యులు చచ్చిపోతావు అన్న స్థితి నుంచి నేను బయటపడ్డాను” అంటూ భావోద్వేగానికి గురైన గాయత్రీ.. ఆ అనుభవం తర్వాత తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నానని తెలిపారు. తనకు మానసిక గాయాలు కలిగించని వారితో మాత్రమే ఇప్పుడు స్నేహం చేస్తున్నానని, అందుకే తన స్నేహితుల వర్గం 90 శాతం తగ్గిపోయిందని చెప్పారు. ప్రస్తుతం తన జీవితంలో నిజంగా నమ్మకమైన నలుగురు మాత్రమే ఉన్నారని వెల్లడించారు.

జీవితానికి అర్ధం తెలుసుకున్నా…

చిన్నతనంలో ప్రేమ లభించకపోవడం వల్ల ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా మారానని ఆమె తెలిపారు. చికిత్సలు, ఆధ్యాత్మిక సాధన తర్వాత తనలో పెద్ద మార్పు వచ్చిందని, ఇప్పుడు జీవితానికి అసలు అర్థం తెలుసుకున్నానని చెప్పారు.

ఇక ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతూ.. తలలో ఉండే పీనియల్ గ్రంథిపై కృత్రిమ ఆహారం, ఫ్లోరిన్, క్లోరిన్ వంటి పదార్థాల ప్రభావం ఉంటుందని, దీని వల్ల మన ఆలోచనా విధానం మారుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. కుండలినీ అవేకనింగ్ ద్వారా ఆ అంతర్గత శక్తిని మేల్కొలపవచ్చని, తద్వారా మనిషి తన జీవిత ప్రయోజనాన్ని అర్థం చేసుకోగలడని వివరించారు. తన జీవితంలో అబ్బాయిల వల్ల ఎంత ట్రామా ఎదురైందో, అమ్మాయిల వల్ల కూడా అంతే బాధ అనుభవించానని గాయత్రీ గుప్తా స్పష్టం చేశారు

Latest News