Site icon vidhaatha

Praggnanandhaa | ప్ర‌జ్ఞానంద‌కి ఆనంద్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్.. చిన్న స‌ల‌హా కూడా ఇచ్చిన వ్యాపార‌వేత్త‌

Praggnanandhaa |

ఆట‌లో ఓడిన కూడా అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్న 18 ఏళ్ల చెస్ గ్రాండ్ మాస్ట‌ర్ ఆర్. ప్ర‌జ్ఞానంద‌. ఫిడె వరల్డ్ కప్‍లో నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సెన్ చెస్ ఛాంపియన్‌గా నిలవగా, భారత యువ ఆటగాడు ఆర్ ప్రజ్ఞానంద రన్నరప్‌తో ముగించాడు. త‌ను 18 ప‌రుగుల‌తో ఓడిన కూడా భార‌తీయుల హృదయాల‌ని మాత్రం ఎంతో గెలుచుకున్నాడు.

ఫైనల్ రెండు ఆటలను అద్భుతంగా ప్రదర్శించినప్ప‌టికీ కార్ల్ సన్ ఎత్తులకు తడబడటంతో ఓడిపోవ‌లసి వ‌చ్చింది. అయితే కొడుకుకి ద‌క్కిన ఆదరణ‌ చూసి ఆ తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోగా, ఆ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే ప్ర‌జ్ఞానంద‌.. చెస్ ప్రపంచకప్ ఫైనల్ చేరిన అతి పిన్న వయస్కుడిగా స‌రికొత్త రికార్డ్ న‌మోదు చేశాడు.

విశ్వనాథన్ ఆనంద్ తర్వాత వరల్డ్ కప్ ఫైనల్ చేరిన రెండో చెస్ భారత ఆటగాడిగా ప్రజ్ఞానంద ఖాతాలో రికార్డ్ చేరింది. ఈ క్ర‌మంలో న‌రేంద్ర‌మోదీ నుండి చాలా మంది ప్ర‌ముఖులు ఆయ‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఇక కొంద‌రు నెటిజ‌న్స్ కొత్త టాలెంట్‌ని ఎప్పుడు ఎంక‌రేజ్ చేసే ఆనంద్ మ‌హీంద్రా.. ప్రజ్ఞానందకు థార్ బహుమతిగా ఇవ్వాలని కోరారు.

దానిపై స్పందించిన ఆనంద్ మ‌హీంద్రా.. త‌న సోష‌ల్ మీడియాలో స్పందిస్తూ..”ప్రజ్ఞానందకు థార్ వాహనాన్ని గిఫ్టుగా ఇవ్వమని చాలా మంది అడుగుతున్నారు. కానీ నేను వేరే ఆలోచ‌న చేస్తున్నాను. ప్రజ్ఞానంద తల్లిదండ్రులు తమ కొడుకుని చిన్నప్పటి నుంచి చదరంగం క్రీడలో ఎంతో ప్రోత్సహించి ఇక్క‌డి వ‌ర‌కు తెచ్చారు. అందుకు వారికి XUV400 EVని బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నాను అంటూ ఆనంద్ మహీంద్రా లో తెలియ‌జేశారు.

ప్రజ్ఞానంద తల్లిదండ్రులు నాగలక్ష్మి, రమేష్ బాబును తాను గౌర‌విస్తున్నాను. వారి ప్రోత్సాహం వ‌ల్ల‌నే చిన్న వ‌య‌స్సులో ప్ర‌జ్ఞానంద గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించాడు అని తెలిపారు. ప్ర‌తి ఒక్కరి తల్లిదండ్లులు తమ పిల్లలకు వీడియో గేమ్‍లకు బదులుగా చెస్ నేర్పించాలని ఆయ‌న కోరారు. ఇక ప్ర‌జ్ఞానంద విష‌యానికి వ‌స్తే.. 2005లో చెన్నైలో జన్మించిన ప్రజ్ఞానంద చిన్నతనం నుంచే చదరంగంలో రాణిస్తూ ఎన్నో అవార్డుల‌ని అందుకున్నాడు.

Exit mobile version