Site icon vidhaatha

Anand Mahindra | తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహింద్రా

Anand Mahindra | తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్‌ గవర్నర్స్ చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా నియమితులయ్యారు.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆటో మొబైల్, ఏయిరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఐటీ వంటి ప్రముఖ రంగాల్లో మహీంద్రా గ్రూపు సంస్థలకు ఆయన చైర్మన్‌గా ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఆనంద్ మహీంద్రాతో సమావేశమై స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు, లక్ష్యాలను వివరించి దానికి చైర్మన్‌గా కొనసాగాలను కోరారు.ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్స్ ఇండియా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఇటీవలే అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది. యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఆగస్టు ఒకటో తేదీన రంగారెడ్డి జిల్లా మీరాఖాన్ పేట బేగరికంచెలో సీఎం రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేశారు.

 

Exit mobile version