Site icon vidhaatha

Shock For YSRCP: వైసీపీకి మరో షాక్

Shock For YSRCP: అధికారం కోల్పోయాక వైసీపీ నుంచి రాజకీయ వలసలు వరుసగా సాగుతున్నాయి. ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు పార్టీని వీడిపోగా..తాజాగా మరో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా పార్టీకి రాజీనామా ప్రకటించారు. మర్రితో సహా ఇప్పటివరకు ఐదుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేయడం గమనార్హం.

పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ, ఇప్పుడు మర్రి రాజశేఖర్ లు వైసీపీ పార్టీని వీడటం గమనార్హం. మర్రి రాజశేఖర్ తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తూ మండలి చైర్మన్ కు రాజీనామా లేఖ అందించారు. వలసలకు అడ్డుకట్ట వేసేందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి పెద్దగా ప్రయత్నాలు చేయకపోవడంతో పార్టీ నుంచి వలసలు ఆగడం లేదు.

అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమవుతుందని..మళ్లీ వైసీపీ పాలనే బాగుందని ప్రజలు తిరిగి తమ పార్టీకి పట్టం కడుతారన్న ధీమాను వైఎస్.జగన్ వ్యక్తం చేస్తున్నారు. జగన్ ధీమా సైతం వలసలను ఆపలేకపోతుండటం పార్టీ కేడర్ ను కొంత కలవర పెడుతోంది.

Exit mobile version