Wife Married Her Boyfriend : ఇటీవలి కాలంలో మానవ సంబంధాలు పెడ దారి పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం..ప్రియుడి కోసం కన్న సంతానాన్ని చంపేయడం వంటి దారుణాలకు మహిళలు ఒడిగట్టడం చూశాం. కూతురికిచ్చి పెళ్లి చేయాల్సిన యువకుడితో ఓ అత్త జంప్ అవ్వడం మరో వింత. ఇకపోతే ఒకే పెళ్లి వేదికపై ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం మరో విస్మయం.
ఉత్తరప్రదేశ్ లోనైతే భార్య త్యాగరాజులు పెరిగిపోతున్నారు. ఇటీవల భార్యను తను ప్రేమించిన యువకుడికి ఇచ్చి ఓ భర్త పెళ్లి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చివరకు రెండో అత్త పుణ్యమా అని ఆ భార్య తన మొదటి భార్య వద్ధకే చేరుకుంది. ఇది ఇలా ఉండగానే అదే యూపీ రాష్ట్రంలో మరో వ్యక్తి కూడా తన భార్యను ఆమె ప్రేమించిన యువకుడికిచ్చి పెళ్లి చేసిన
షాకింగ్ ఘటన వైరల్ గా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో భన్వర్ సింగ్ తన భార్య వైష్ణవిని ఆమె ప్రియుడితో వివాహం జరిపించాడు. రెండేళ్ల క్రితం వైష్ణవితో భన్వర్ పెళ్లి జరిగింది . ఆమె ప్రేమ వ్యవహారం తెలుసుకొని ప్రియుడితో భార్య పెళ్లి జరిపించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి వీరి పెళ్లి కథ ఎంతమేరకు కొనసాగుతుందో చూడాల్సి ఉంది. యూపీలో వరుసగా నెల రోజుల వ్యవధిలోనే భార్యలను ప్రియుళ్లకు ఇచ్చి పెళ్లి చేసిన భర్తల ఘటనలు రెండుచోట్ల చోటుచేసుకోవడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు భర్తల త్యాగం సరైందంటే..మరికొందరు కలికాలం పైత్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు.