MLA Pailla Shekar Reddy
- గోబ్యాక్.. డౌన్ డౌన్ నినాదాలతో నిరసన
విధాత: భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి నియోజకవర్గంలోని అనంతారం గ్రామస్తులు షాకిచ్చారు. తమ సమస్యలు చెప్పుకుందామంటే ఎమ్మెల్యే తమకు సమయం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ గ్రామస్తులు నిరసనకు దిగారు.
గ్రామంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని, దళిత బంధు పథకాన్ని కొందరికే ఇచ్చారంటు గ్రామ సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని ఆరోపిస్తు గ్రామస్తులు ఎమ్మెల్యే కార్యక్రమాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు.గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన పైళ్లకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలుపగా పోలీసులు వారిని నిలువరించారు.
అనంతరం ఎమ్మెల్యే అనుచరులకు, గ్రామస్తులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వివాదం సాగింది. అంతకు ఒకరోజు ముందు భువనగిరిలో నిర్వహించిన పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సైతం గిరిజనుల నుండి ఈ తరహా నిరసన ఎదురవ్వడం గమనార్హం.