Anushka Shetty |
అనుష్క శెట్టి సూపర్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. అప్పటి వరకు స్విటీశెట్టిగా ఉన్న ఈ సినిమాతో అనుష్క శెట్టిగా మారింది. ఆ తర్వాత వరుస చిత్రాలను చేస్తూ కొద్దిరోజుల్లోనే అగ్రహీరోలతో నటించింది. నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, వెంకటేశ్ ముగ్గురితోనూ నటించింది.
ఆ తర్వాత ప్రభాస్, మహేశ్ బాబు, రవితేజ, గోపీచంద్‌తో నటించింది. అదే సమయంలో ‘అరుధంతి’, ‘భాగమతి’ తదితర హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లోనూ సత్తాచాటింది. అయితే, మెగా హీరోలు చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో మాత్రం కలిసి నటించలేదు. మెగాస్టార్ ‘స్టాలిన్’ చిత్రంలో స్పోషల్ సాంగ్‌లో చేసింది.
సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా.. అనుష్క హీరోయిన్‌గా ఓ సినిమాను ప్రకటించినా.. అది సెట్స్‌పైకి వెళ్లలేదు. తాజాగా చిరంజీవితో అనుష్క తొలిసారిగా జోడీ కట్టబోతుందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని, త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దాదాపు అనుష్క ఖరారైనట్టేనని.. వెండితెరపై ఇద్దరు కనువిందు చేయనున్నారని తెలుస్తున్నది.
ప్రస్తుతం చిరంజీవి రెండు చిత్రాల్లో నటించనున్నారు. ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో సోషియో ఫాంటసీ జానర్ నటించనున్నారు. ఇటీవల ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. మరో చిత్రం కురసాల కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి నటించనున్నారు.
అయితే, ఇందులో మల్లిడి విశిష్ట సినిమా తొలుత సెట్స్‌పైకి వెళ్లనున్నది. ఈ సినిమా కోసం అనుష్కను సంప్రదించారని తెలుస్తున్నది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా.. ఇప్పటికే స్విటీ ఆ నిర్మాణ సంస్థలో మూడు చిత్రాలు చేసింది. ఈ క్రమంలో చిత్రంలో అనుష్కను దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం.
ఇక అనుష్క ఇటీవల ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’తో తెరపై కనిపించింది. దాదాపు ఐదేళ్ల తర్వాత వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నది. చిత్రంలో అనుష్క తన తనటతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ చిత్రం తర్వాత అనుష్క మరే చిత్రాన్ని అంగీకరించలేదు. రొటీన్‌కు భిన్నంగా ఉన్న కథలను, వైవిధ్యంగా ఉండే పాత్రలపై అనుష్క దృష్టి పెడుతున్నది. మెగాస్టార్ నటించే చిత్రం సోషియే ఫాంటసీ జానర్‌లో వస్తుండడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేననే టాలీవుడ్‌లో టాక్.