ఆపిల్‌ లవర్స్‌కి త్వరలో విజన్‌ ప్రో వర్చువల్‌ హెడ్‌సెట్‌..!

ఆపిల్‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌. కంపెనీ వర్చువల్‌ రియాల్టీ హెడ్‌సెట్‌ విజన్‌ ప్రోని త్వరలో లాంచ్‌ చేయబోతున్నది

  • Publish Date - January 10, 2024 / 05:12 AM IST

Apple Vision Pro | ఆపిల్‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌. కంపెనీ వర్చువల్‌ రియాల్టీ హెడ్‌సెట్‌ విజన్‌ ప్రోని త్వరలో లాంచ్‌ చేయబోతున్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్‌ అవబోతున్నదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అమెరికాలో డిస్ట్రిబ్యూషన్​ సెంటర్స్​కి చేరుతున్నట్లు తెలిపాయి. లాంచ్‌ తర్వాత వర్చువల్‌ హెడ్‌సెట్స్‌ ఆపిల్‌ రిటైల్‌ స్టోర్స్‌లో అందుబాటులోకి రానున్నాయి. అయితే, ఇప్పటి వరకు లాంచ్‌ డేట్‌ను ప్రకటించని కంపెనీ.. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.


హెడ్​సెట్​ సేల్స్‌ కోసం రిటైల్‌ ఉద్యోగులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లుగా తెలుస్తున్నది. ప్రతి స్టోర్‌నుంచి ముగ్గురు, నలుగురిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. వారిని స్టోర్స్‌కు పంపి.. మిగతా వారికి శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నది. ఆపిల్‌ కంపెనీ తొలిసారిగా 2023లో విజన్‌ ప్రోని పరిచయం చేసింది. రియాల్టీ హెడ్​సెట్​లో ఎం2 చిప్​సెట్​, రెండు హై- రిసొల్యూషన్​ 4కే ఐపీస్​లు ఉంటాయి. ఇందులో ఎక్స్​టర్నల్​ బ్యాటరీ ప్యాక్​ సైతం ఉంటుంది.


వర్చువల్‌ హెడ్‌ సెట్‌తో రియాలిటీ అనుభూతిని పొందవచ్చు. ప్రస్తుతం విజన్‌ ప్రో అమెరికాలో మాత్రమే అందుబాటులో రానుందని తెలుస్తున్నది. ఈ దీని ప్రారంభ ధర 3,499 డాలర్లు ఉంటుందని అంచనా. భారతీయ కరెన్సీలో రూ.2.91లక్షలు. భారత్‌లో లాంచ్‌పై ఇంకా ఎలాంటి వివరాలు తెలియరాలేదు. కంపెనీ విజన్‌ ప్రోని భారత్‌, చైనా, కెనడా, యూకే సహా లాంచ్‌ చేయబోతున్నట్లు సమాచారం.

Latest News