Site icon vidhaatha

Health tips | షుగర్‌ రోగులు తరచూ ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట..!

Health tips : షుగర్‌ వ్యాధి ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్నది. ఈ వ్యాధి బారినపడి ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. షుగర్‌ బారినపడితే నచ్చిన తిండి తినకూడదు. నచ్చిన పానీయం తాగకూడదు. ఎందులో అయితే చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయో వాటిని మాత్రమే తీసుకోవాలి. పండ్లలో కూడా అన్ని పండ్లు ఆరోగ్యానికి మంచిది కాదు. మరీ తియ్యగా ఉండే పండ్ల జోలికి వెళ్లకూడదు. అయితే తీపి తక్కువగా ఉండే కొన్ని రకాల పండ్లు షుగర్‌ వ్యాధిని అదుపులో పెట్టడానికి తోడ్పడుతాయి. ఆ పండ్లేమిటో ఇప్పుడు చూద్దాం..

యాపిల్‌ ( Apple)

రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్‌ అవసరం ఉండదంటారు. యాపిల్ తినడంవల్ల పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు చెబుతారు. ఈ పండులో విటమిన్ సి, డైల్యూటెడ్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారు యాపిల్స్‌ తినడంవల్ల బ్లడ్‌ షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. యాపిల్‌లో పెక్టిన్ అనే ఒక రసాయనం ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెరను సగానికి తగ్గిస్తుంది. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు యాపిల్ తినడం మంచిదే.

బెర్రీ పండ్లు (Berry)

ఎంతో రుచికరంగా ఉండే బెర్రీలలో బ్లడ్‌ షుగర్‌ని నియంత్రించడానికి సహాయపడే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఉంటాయి. స్ట్రాబెర్రీలకు గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు కూడా తక్కువ మొత్తాల్లో ఉంటాయి. స్ట్రాబెర్రీస్ పొట్టను నిండుగా ఉంచడంలో సహాయపడుతాయి. ఇవి శరీరంలోని శక్తిని కోల్పోకుండా సహాయపడుతాయి. రక్తంలోని చక్కెర నిల్వలను క్రమబద్ధీకరిస్తాయి.

సంత్రా పండు (Orange)

సిట్రస్‌ జాతి పండు అయిన నారింజలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉటుంది. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ, ల్యూటిన్‌, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇది 87 శాతం నీటి నిల్వలతో తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. నారింజ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో కూడా తోడ్పడుతుంది. అంతేగాక మీ బరువును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. తరచూ ఆరెంజ్‌ తింటే మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవచ్చు.

కివీ పండు (Kiwi)

డయాబెటిక్ రోగులు కివీ పండును తినవచ్చు. ఇందులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, తక్కువ కేలరీలు, తక్కువ పిండి పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి. కివీలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ పండుతో సెరటోనిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. రాత్రుళ్లు బాగా నిద్ర పడుతుంది.

అవకాడో (Avocado)

అవకాడోను పోషకాల పవర్ హౌస్ అంటారు. రుచితోపాటు ఎన్నో పోషకాలు దీనిలో ఉన్నాయి. ప్రతిరోజూ ఒక అవకాడోను ఆహారంలో భాగంగా చేసుకుంటే గుండె ఆరోగ్యం, కంటి ఆరోగ్యం, బరువు తగ్గడంతోపాటు డయాబెటిస్‌ను కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. అవకాడోలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కొవ్వు పదార్థం తక్కువగా ఉంటుంది. అందుకే అవకాడోను మధుమేహ రోగులకు మంచి ఆహారమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా బరువు తగ్గడానికి, చెడు కొవ్వును తగ్గించి, మంచి కొవ్వును పెంచడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి 

Health tips | ఈ పండ్ల జ్యూస్‌లు తరచూ తాగితే.. మీ జ్ఞాపకశక్తిని మీరే నమ్మలేరు..!

Health tips | మీలో ఈ లక్షణాలున్నాయా.. కిడ్నీలు ప్రమాదంలో పడ్డాయేమో.. పరీక్షలు చేయించుకోండి..!

Health tips | గుండె వ్యాధుల రిస్క్‌ తగ్గాలంటే ఎలాంటి డైట్‌ పాటించాలో తెలుసా..?

Health tips | వానాకాలం ఇన్‌ఫెక్షన్‌లకు గుడ్‌బై చెప్పాలంటే.. మీ డైలీ డైట్‌లో ఈ పండ్లు ఉండాల్సిందే..!

Health tips | అద్భుతమైన ఔషధ లక్షణాలున్న ఈ పునర్నవ ఆకుల గురించి మీకు తెలుసా..?

Exit mobile version