UP Encounters | చిక్కుల్లో యోగీ సర్కారు..! ఉత్తరప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్లపై విచారణ జరిపించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌..!

UP Encounters | ఉత్తరప్రదేశ్‌కి చెందిన గ్యాంగ్‌స్టర్‌ అతిక్‌ అహ్మద్‌ సోదరుడు అష్రఫ్‌ల హత్యపై ఆదివారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ హత్యాకాండపై విచారణకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో కోరారు. న్యాయవాది విశాల్‌ తివారీ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో 2017 నుంచి ఉత్తరప్రదేశ్‌లో జరిగిన 183 ఎన్‌కౌంటర్లపై సైతం ఆయన విచారణకు డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆరేళ్లలో […]

  • Publish Date - April 17, 2023 / 05:20 AM IST

UP Encounters | ఉత్తరప్రదేశ్‌కి చెందిన గ్యాంగ్‌స్టర్‌ అతిక్‌ అహ్మద్‌ సోదరుడు అష్రఫ్‌ల హత్యపై ఆదివారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ హత్యాకాండపై విచారణకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో కోరారు. న్యాయవాది విశాల్‌ తివారీ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌లో 2017 నుంచి ఉత్తరప్రదేశ్‌లో జరిగిన 183 ఎన్‌కౌంటర్లపై సైతం ఆయన విచారణకు డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆరేళ్లలో 183 మంది నేరస్థులు మరణించినట్లుగా తెలిపారు. అతీక్‌ హత్యను ప్రస్తావిస్తూ.. పోలీసుల చర్యలు ప్రజాస్వామ్యానికి, న్యాయవ్యవస్థకు పెను ప్రమాదంగా పరిణమిస్తున్నాయని పేర్కొన్నారు.

జర్నలిస్టులగా వచ్చి.. మాఫియా అతిక్‌, అష్రఫ్‌లను హతమార్చి..

ప్రయాగ్‌రాజ్‌లోని కొల్విన్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. మాఫియా అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను మెడికల్ కాలేజీ సమీపంలో జర్నలిస్టులుగా బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో ఉన్న ఇద్దరిని స్వరూపారాణి నెహ్రూ ఆసుప్రతికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఘటనా స్థలం నుంచి రెండు పిస్టల్స్‌, ఆరు కియోస్క్‌లు లభ్యమయ్యాయి.

ఉమేష్‌ పాల్‌ కిడ్నాప్‌ కేసులో ఎంపీఎంఎల్‌ఏ కోర్టు అతిక్‌కు జీవిత ఖైదు విధించింది. అయితే, అతిక్ అహ్మద్‌పై 100కుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కాల్పులు జరిగిన సమయంలో అతిక్, అష్రఫ్‌తో పాటు దాదాపు 20 మంది వరకు ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు ఉన్నారు.

రాత్రి 10.19 గంటల ప్రాంతంలో పోలీస్‌ బృందం ధూమన్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి అతిక్, అష్రఫ్‌లతో కలిసి బయటకు వచ్చారు. ధూమన్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, ఉమేష్‌పాల్ హత్య కేసు విచారణ అధికారి రాజేశ్‌కుమార్‌ మౌర్య నేతృత్వంలో వీరిని విచారణకు కోసం తీసుకువచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి కాల్పులు జరిగాయి.

ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయ విచారణ కమిటీ ఏర్పాటు

అతీక్‌ అహ్మద్‌, అష్రఫ్‌ హత్కయలపై న్యాయ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. రెండు నెలల్లో కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. అలహాబాద్‌ హైకోర్టుకు చెందిన రిటైర్డ్‌ జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ త్రిపాఠి నేతృత్వంలోని రిటైర్డ్‌ ఐపీసీ అధికారి సుబేష్‌ కుమార్‌ సింగ్‌, రిటైర్డ్‌ జిల్లా జడ్జి బ్రిజేష్‌ కుమార్‌ సోనీ సభ్యులుగా ఉండనున్నారు.

ఇదిలా ఉండగా.. కాల్పుల ఘటన నేపథ్యంలో ముగ్గురు నిందితులపై పోలీసులు 302, 307 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతిక్, అష్రఫ్‌లను హత్య చేసిన నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. నిందితులు పోలీసులకు పలు షాకింగ్ సమాచారం ఇచ్చారు. అతీక్ ముఠాను అంతమొందించాలనుకున్నామని పేర్కొన్నారు.

గ్యాంగ్‌స్టర్‌ను చంపితే పేరు వస్తుందని, అందుకే హత్యకు పాల్పడినట్లు పేర్కొన్నట్లు సమాచారం. అందుకే జర్నలిస్టుల ముసుగులో వచ్చామని, హత్య తర్వాత తప్పించుకోలేకపోయామని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Latest News