-8.71 శాతం ఆఫర్ చేస్తున్న ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
విధాత: ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీరేట్లను ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పెంచింది. సాధారణ కస్టమర్లకు వార్షిక వడ్డీరేటును 8.11 శాతంగా, సీనియర్ సిటిజన్లకు 8.71 శాతంగా ప్రకటించింది. కొత్త వడ్డీరేట్లు సోమవారం నుంచే వర్తిస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది. ప్రస్తుతం పోటీ బ్యాంకులతో పోల్చిచే కచ్ఛితంగా ఇది ఆకర్షణీయ వడ్డీరేటే.
అయితే కనీస డిపాజిట్ రూ.5,000లుగా ఉండాలి. కాగా, ఎఫ్‌డీ కోసం నేరుగా దగ్గర్లోని ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ శాఖనుగానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లను సందర్శించవచ్చు. ఆపై తమ ప్రతినిధులు కస్టమర్లకు సేవింగ్స్, డిపాజిట్లకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తారని బ్యాంక్ తెలిపింది.
కరెంట్, సేవింగ్స్ ఖాతాలతోపాటు బంగారంపై రుణాలు, గృహ రుణాల వంటి సేవలనూ ఈ బ్యాంక్ అందిస్తున్నది. ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్లపై ఆకర్షణీయ వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నది. బ్యాంక్ ఖాతాదారులు యూపీఐ సేవలనూ పొందవచ్చు. నిరుడు మార్చి ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 12వేలకుపైగా శాఖలు, 32 లక్షలకుపైగా కస్టమర్లు బ్యాంక్‌కు ఉన్నారు.