బేరం కుదిరినట్టేనా! బాబు.. పవన్ భేటి ఆంతర్యం..?

విధాత‌: జగన్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లు రూమర్స్ వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో భేటి అయ్యారు.. పొత్తు.. సీట్ల పంపిణీ వంటి అంశాలు మీద చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ 32 అసెంబ్లీ సీట్లు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఈస్ట్.. వెస్ట్ గోదావరి జిల్లాలతోబాటు విశాఖ జిల్లాల్లో తమకు ఎక్కువ సీట్లు కావాలని పవన్ డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. ఆమధ్య విశాఖలో పవన్ ను ప్రభుత్వం హోటల్లో నిర్బంధించిన తరువాత పవన్.. […]

  • Publish Date - January 8, 2023 / 10:11 AM IST

విధాత‌: జగన్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లు రూమర్స్ వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో భేటి అయ్యారు.. పొత్తు.. సీట్ల పంపిణీ వంటి అంశాలు మీద చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ 32 అసెంబ్లీ సీట్లు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఈస్ట్.. వెస్ట్ గోదావరి జిల్లాలతోబాటు విశాఖ జిల్లాల్లో తమకు ఎక్కువ సీట్లు కావాలని పవన్ డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు.

ఆమధ్య విశాఖలో పవన్ ను ప్రభుత్వం హోటల్లో నిర్బంధించిన తరువాత పవన్.. చంద్రబాబు భేటి అయ్యారు.. ఒకరితో ఒకరు ఓదార్పు మాటలు చెప్పుకున్నారు. ఆ తరువాత మళ్ళీ ఇప్పుడు ఈ ఇద్దరూ భేటి అవుతున్నారు. ఇపుడు జరుగుతున్న భేటీలు అన్నీ కూడా రేపటి ఎన్నికల కోసమే అంటున్నారు. ఆ విధంగా ఆలోచన చేస్తే కనుక ఈ తాజా భేటీలో జనసేనకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే సీట్ల విషయంలో సీరియస్ గానే చర్చ సాగింది అని అంటున్నారు. నిజానికి పొత్తులు ఏనాడో కుదిరాయి. సీట్ల వద్దనే పంచాయతీ తేలడంలేదు.

అయితే జనసేన 32 సీట్లకు పట్టుపడుతోంది. ఆ విధంగా కనుక తమకు సీట్లు ఇస్తే అందులో కనీసం ఒక 25 దాకా గెలిస్తే రేపటి ఎన్నికల తరువాత ఏర్పడే ప్రభుత్వంలో తమ ప్రభావం గట్టిగా ఉంటుందని పవన్ ఆలోచన అని చెబుతున్నారు. అదే విధంగా జనసేనకు అన్ని సీట్లు ఇస్తే గెలుస్తుందా లేక అవి వైసీపీ పరం అవుతాయా అన్న బెంగ కూడా ఉంది. అందుకే సీట్ల విషయంలో తెలుగుదేశం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అని అంటున్నారు. దాంతో ఇపుడు ఆ విషయం తేల్చుకునేందుకే పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబు వద్దకు వెళ్లారు అని అంటున్నారు. మరి తెలుగుదేశం మనసులో అయితే 15 నుంచి మొదలెట్టి 20 దాకా రెట్టించి పాతికకు తెగ్గొడదామని ఉంది అని అంటున్నారు.

ఇపుడు పవన్ కళ్యాణ్ యాభై అనడంతో తెలుగుదేశం కూడా కాస్తా పట్టూ విడుపూ ప్రదర్శించి దాన్ని కాస్తా మరింతగా పెంచింది అని అంటున్నారు. అంటే 32 సీట్ల దాకా జనసేనకు ఇవ్వడానికి తెలుగుదేశం అంగీకరించనుంది అని అంటున్నారు. ఇదే ఈ ఇద్దరి భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. అంటే రెండు పార్టీల పొత్తుకు ఎంతో కొంత ఇబ్బందిగా ఉన్న సీట్ల పంచాయతీ అయితే తెగిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.