విధాత: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసును ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సీబీఐకి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేష్ కు అందివచ్చిన అవకాశంలా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో కొందరు పెద్దలు ఆ హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ దివంగత వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఇంకా నిందితులు ఉద్దేశ పూర్వకంగా హత్యకు సంబంధించిన ఆధారాలు నాశనం చేశారని, ఏపీలో విచారణ సజావుగా సాగడం లేదని, సీబీఐ మీద ఒత్తిళ్లు ఉన్నాయని కోర్టులో పిటిషన్ వేశారు.
మరోవైపు సీబీఐ కూడా తమ మీద ఏపీలో ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు.దీంతో సుప్రీం కోర్టు ఈ కేసు విచారణను తెలంగాణను తెలంగాణ పరిధిలోని సీబీఐకి బదిలీ చేసింది. ఈ అంశం చంద్రబాబుకు అవకాశంగా మారింది. వెంటనే ట్విట్టర్లో లైన్లోకి వచ్చి మీరు సీఎంగా ఉన్న రాష్ట్రంలో విచారణను సుప్రీం కోర్టు వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం మీకు అవమానం.. సిగ్గు చేటు.. తలెక్కడ పేట్టుకుంటారూ అంటూ సెటైర్లు వేశారు.
సొంత బాబాయ్ హత్య కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ. అది కూడా నువ్వు సీఎంగా ఉండగా! తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్ రెడ్డీ?#AbbaiKilledBabai #JaganMustResign pic.twitter.com/75rjjMP6Ra
— N Chandrababu Naidu (@ncbn) November 29, 2022
అంతే కాకుండా జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోకేష్ కూడా ట్విట్టర్లో “బాబాయ్ హత్య కేసు పక్క రాష్ట్రానికి- , అబ్బాయ్ చంచల్ గూడా జైలుకు అని ట్వీట్ చేశారు. మొత్తానికి వివేకా హత్యకేసు దర్యాప్తు తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేసిన పరిణామం చంద్రబాబుకు, లోకేష్ బాబుకు ఇలా పనికొచ్చిందని అంటున్నారు.
బాబాయ్ హత్య కేసు పక్క రాష్ట్రానికి… అబ్బాయ్ చంచల్ గూడ జైలుకి..#AbbaiKilledBabai pic.twitter.com/QYOwEjaBxj
— Lokesh Nara (@naralokesh) November 29, 2022