విధాత : హైదరాబాద్ బల్కంపేట్ ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లు ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు కల్యాణోత్సవానికి హాజరయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చారు.
కల్యాణోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం రథోత్సవం, అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఫలహార బండ్లు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో దేావాదాయ శాఖ కమిషన్ వెంకట్రావు పాల్గొన్నారు.