Bank Holidays | బ్యాంకు పనులుంటే ముందే చేసుకోండి..! సెప్టెంబర్‌లో 17 రోజులు సెలవులే..!

Bank Holidays | సెప్టెంబర్‌ నెల ప్రారంభమైంది. ప్రతి నెలా బ్యాంకులకు కొన్ని సెలవులున్నట్టే సెప్టెంబర్‌లోనూ సెలవులు ఉన్నాయి. అయితే, ఏయే రోజులు సెలవులో తెలుసుకుంటే అందుకు అనుగుణంగా బ్యాంకు పనుల్ని ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు తప్పవు. ప్రతి నెలలో ప్రతి బ్యాంకుకు ప్రతి ఆదివారంతో పాటు రెండు, నాల్గో శనివారాలు సెలవులుంటాయి. ఇవే కాకుండా పండుగలు, ప్రత్యేక రోజుల సెలవులుంటాయి. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు […]

  • Publish Date - September 1, 2023 / 11:09 AM IST

Bank Holidays |

సెప్టెంబర్‌ నెల ప్రారంభమైంది. ప్రతి నెలా బ్యాంకులకు కొన్ని సెలవులున్నట్టే సెప్టెంబర్‌లోనూ సెలవులు ఉన్నాయి. అయితే, ఏయే రోజులు సెలవులో తెలుసుకుంటే అందుకు అనుగుణంగా బ్యాంకు పనుల్ని ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు తప్పవు.

ప్రతి నెలలో ప్రతి బ్యాంకుకు ప్రతి ఆదివారంతో పాటు రెండు, నాల్గో శనివారాలు సెలవులుంటాయి. ఇవే కాకుండా పండుగలు, ప్రత్యేక రోజుల సెలవులుంటాయి. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది.

అదే విధంగా సెప్టెంబర్‌ 2023 బ్యాంకుల సెలవులు జాబితాను విడుదల చేసింది. సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో ఎనిమిది రోజుల పాటు సెలవులు ఉన్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. ఈ నెలలో దేశవ్యాప్తంగా నాలుగు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతో కలిపి 17 సెలవులు ఉండబోతున్నాయి.

సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి బ్యాంకు మొత్తం 17 రోజులు మూసివేసే అవకాశం ఉండదు. హైదరాబాద్‌లో నాలుగు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతో పాటు అదనంగా సెప్టెంబర్ 7, 18, 28 తేదీల్లో బ్యా్ంకులు మూతపడనున్నాయి.

సెప్టెంబర్‌లో బ్యాంక్ సెలవులు..

3 సెప్టెంబర్, ఆదివారం
6 సెప్టెంబర్, శ్రీకృష్ణ జన్మాష్టమి
7 సెప్టెంబర్, శ్రీకృష్ణ జయంతి (గుజరాత్, మధ్యప్రదేశ్, చండీగఢ్, సిక్కిం, రాజస్థాన్, జమ్ము, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్ రాష్ట్రాల్లో సెలవు)
సెప్టెంబర్ 9, రెండో శనివారం
సెప్టెంబర్ 10, ఆదివారం
సెప్టెంబర్ 17, ఆదివారం
సెప్టెంబర్ 18, వినాయక చవితి.
సెప్టెంబర్ 19 : గణేశ్‌ చతుర్థి (గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, గోవా ప్రాంతాల్లో సెలవు)
సెప్టెంబర్ 20, గణేశ్‌ చతుర్థి రెండో రోజు నుఖాయ్ ఒడిశాలో జరుపుకుంటారు
సెప్టెంబర్ 22, శ్రీనారాయణ గురు సమాధి చెందిన రోజైన కేరళలో ప్రాంతీ సెలవు
సెప్టెంబర్ 23, నాల్గవ శనివారం సెలవు. (మహారాజా హరి సింగ్ పుట్టినరోజు కూడా. జమ్ము, శ్రీనగర్‌లో ప్రాంతీయ సెలవు)
సెప్టెంబర్ 24, ఆదివారం
సెప్టెంబర్ 25, ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ
సెప్టెంబర్ 27, మిలాద్-ఎ-షెరీఫ్ (మహమ్మద్ ప్రవక్త ముహమ్మద్ పుట్టినరోజు)
సెప్టెంబర్ 28, : ఈద్ అల్-అధా లేదా మిలాద్‌-ఉన్‌-నబీ. (జాతీయ సెలవు దినం. అన్ని బ్యాంకులు సెలవు దినంగా పాటిస్తాయి)
సెప్టెంబర్ 30, ఆదివారం

Latest News