Batti Vikramarka | పునరావాస కేంద్రాలల్లో వారి గోస‌ చూస్తుంటే భాదేస్తుంది

Batti Vikramarka మర పడవలు ద్వారా సున్నం బట్టి, మాల కాశీ నగర్ గ్రామాలకు వెళ్ళిన భట్టి విక్రమార్క విధాత‌: గోదావరి వరదలతో నీట మునిగిన భద్రాచలం డివిజన్ పరిధిలోని సున్నం బట్టి, మాల కాశీ నగర్ గ్రామాలను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క , స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య తో కలిసి మర పడవలు వేసుకొని ఆ గ్రామాలను పరిశీలించారు. నిన్న రాత్రి ఇరు గ్రామాల‌కు చెంద‌న బాధితుల‌ను […]

  • Publish Date - July 29, 2023 / 12:37 AM IST

Batti Vikramarka

  • మర పడవలు ద్వారా సున్నం బట్టి, మాల కాశీ నగర్ గ్రామాలకు వెళ్ళిన భట్టి విక్రమార్క

విధాత‌: గోదావరి వరదలతో నీట మునిగిన భద్రాచలం డివిజన్ పరిధిలోని సున్నం బట్టి, మాల కాశీ నగర్ గ్రామాలను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క , స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య తో కలిసి మర పడవలు వేసుకొని ఆ గ్రామాలను పరిశీలించారు. నిన్న రాత్రి ఇరు గ్రామాల‌కు చెంద‌న బాధితుల‌ను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.

ఈ క్ర‌మంలోనే ఇప్పటికీ ఆ గ్రామంలోనే ఉన్న మరికొందరితో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారిని కూడా పున‌రావాస కేంద్రాల‌కు వెళ్లాల‌ని భ‌ట్టి కోరారు. అయితే తమ పశువులు వస్తువులు వదిలి రావడం ప్రతి ఏడాది ఇదే ఇబ్బందులు పడుతున్నామ‌ని సిఎల్పీ నేత భట్టికి సున్నం బట్టి, మాల కాశీ నగర్ వాసులు వివరించారు. అంతకు ముందు తాలవాయి బాడువ ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో బాధితులతో మాట్లాడి అక్కడ వసుతుల గురుంచి అడిగి తెలుసుకున్నారు.

ఆహారం శుభ్రంగా ఉండటంలేదు, సమయానికి అందటంలేదని, త్రాగునీరు కూడా ఇబ్బందిగా ఉన్నది, కనీసం విద్యుత్ సౌకర్యం కూడా ఉండటం లేదని భాదితులు సిఎల్పీ నేతకు వివరించారు. భద్రాచలం పట్టణంలో ఏర్పాటు చేసిన పునరావాసం కేంద్రం సందర్శించిన అనంతరం విక్ర‌మార్క‌ మీడియాతో మాట్లాడారు. వరదల పట్ల ప్రభుత్వానికి కనీస అవగాహన లేదని, బాధితుల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం సానుభూతి లేదన్నారు. పునరావాస కేంద్రాలల్లో వారి గోస‌ చూస్తుంటే భాదేస్తుందని భ‌ట్టి విక్ర‌మార్క సానుభూతి వ్య‌క్తంచేశారు.

Latest News