Site icon vidhaatha

Digvesh Rathi: దిగ్వేశ్ రాఠీ పై బీసీసీఐ సస్పెన్షన్ వేటు

Digvesh Rathi:  ఐపీఎల్ -2025లో లఖ్ నవూ సూపర్ జెయింట్స్ ఆటగాడు దిగ్వేశ్‌ రాఠీపై బీసీసీఐ సస్పెండ్‌ వేటు వేసింది. క్రమశిక్షణ ఉల్లంఘన కింద అతనిపై ఈ చర్య తీసుకుంది. దిగ్వేశ్‌ రాఠీపై బీసీసీఐ ఒక మ్యాచ్‌ నిషేధం విధించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మతో దిగ్వేశ్‌ వివాదానికి దిగడమే దీనికి కారణం. సన్ రైజర్స్ లక్ష్య చేధనకు అనుగుణంగా ఒపెనర్ అభిషేక్ శర్మ ధనాధన్ షాట్లతో విరుచుకపడ్డాడు. అతడిని ఎనిమిదో ఓవర్ లో అవుట్ చేసిన దిగ్వేష్ మరోసారి తనదైన వివాదస్పద శైలీ నోట్ బుక్ సంబరాలు చేసుకున్నాడు. దీంతో అభిషేక్ అతడిని చూస్తూ ఏదో కామెంట్ చేయగా..కోపంతో దిగ్వేశ్ అతడి మీదకు వెళ్లి వాగ్వివాదానికి దిగాడు. అంపైర్లు, తోటి ఆటగాళ్లు వారికి సర్ధిచెప్పి అభిషేక్ మైదానం నుంచి వెళ్లిపోయాడు. అంతటితో ఆగకుండా తర్వాతా ఇషాన్ కిషన్ ను అవుట్ చేసినప్పుడు కూడా అదే రీతిలో సంబరాలు చేసుకున్నాడు.

ఇప్పటికే ఈ సీజన్ లో గత  మ్యాచ్ లలోనూ దిగ్వేశ్ తన నోట్ బుక్ సంబరాలతో వివాదాల పాలవ్వగా.. దీనిపై బీసీసీఐ పలుమార్లు మందలించడంతో పాటు జరిమానా విధించింది. మరోసారి దిగ్వేశ్ సన్ రైజర్స్ తో మ్యాచ్ లోనూ అలాగే చేయడంతో పాటు అవుటై వెళ్లిపోతున్న ఆటగాడితో వివాదానికి దిగడంతో బీసీసీఐ అతడిపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ చర్యతో క్రమశిక్షణ చర్య తీసుకుంది. మ్యాచ్ అనంతరం దిగ్వేశ్ తో జరిగిన వివాదంపై అభిషేక్ స్పందిస్తూ గేమ్ పూర్తయ్యాక మేం మాట్లాడుకున్నామని..మేం కూల్ అయ్యాం అంటూ వ్యాఖ్యానించాడు. అయితే వారిద్దరి వివాదం వైరల్ కావడంతో బీసీసీఐ ఈ ఘటనపై స్పందించి క్రమశిక్షణ చర్యలను ప్రకటించింది.

Exit mobile version