విధాత: బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో రూపొందించిన చిత్రం భైరవం (Bhairavam). నాంది ఫేమ్ విజ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ప్రముఖ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ కథానాయికగా నటించింది. తమిళ బ్లాక్‌బస్టర్ గరుడకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ థీమ్ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు.