Site icon vidhaatha

Asteroid | 15న భూమికి సమీపంగా ఆస్టరాయిడ్‌.. ఢీ కొడుతుందా?

Asteroid | కిలోమీటర్‌ వ్యాసార్థంతో ఓ భారీ గ్రహశకలం భూమివైపుగా దూసుకువస్తున్నది. అయితే, అంతరిక్ష రాయి భూమిని ఢీకొట్టే అవకాశాలు ఏమీ లేవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న క్రమంలో ఆస్టరాయి భూమికి సమీపంలోకి రాబోతున్నాయని, దాన్ని చుట్టు కొలత 500 నుంచి 850 వరకు ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

సౌర వ్యవస్థ ఏర్పడిన క్రమంలో అనేక రాతి శకలాలు ఇలా వేరు పడి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. వీటిని గ్రహ శకలాలు, ఆస్టరాయిడ్స్‌గా అని పిలుస్తుంటారు. 2020 డీబీ5 పేరుగల గ్రహశకలం ఈ నెల 15న భూమికి 43,08,418 కిలోమీటర్ల దగ్గరకు రానున్నది.

ఈ అంతరిక్ష రాయి గంటకు 34,272 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నది. ఈ గ్రహశలం చివరిసారిగా 1995లో భూమికి దగ్గరగా వచ్చింది. మళ్లీ 2048లో భూమికి దగ్గరగా వస్తుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహశకలం వ్యాసార్థం 150 కిలోమీటర్లకుపైగా ఉన్నందున ప్రమాదకరమైందని పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల 488453 (1994 ఎక్స్ డీ) పేరు గల గ్రహశకలలం ఈ నెల 12న భూమి సమీపానికి వచ్చింది. గంటకు 77,292 కిలోమీటర్ల వేగంతో భూమికి 31.62లక్షల కిలోమీటర్ల దూరం నుంచి దూసుకుపోయింది. ఈ ఆస్టరాయిడ్‌ చివరిసారిగా 2012 నవంబర్‌ 27న భూమికి చేరువగా రాగా.. తిరిగి 2030లో మళ్లీ దగ్గరా వస్తుందని నాసా వివరించింది.

Exit mobile version