Site icon vidhaatha

CPR | పిచ్చుక‌కు సీపీఆర్.. ఊపిరి తీసుకొని గాల్లో ఎగిరిన ప‌క్షి

CPR | మ‌న‌షుల‌కే సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడుతారు క‌దా..! మ‌రి పిచ్చుక‌( Bird )కు సీపీఆర్( CPR ) చేయ‌డం ఏంట‌ని అనుకుంటున్నారా..? మీరు ఆలోచించేదే నిజ‌మే. అయితే మ‌న‌షుల‌కు సీపీఆర్ చేసిన మాదిరిగానే పిచ్చుకకు కూడా సీపీఆర్ చేసి దాని ప్రాణాలు కాపాడాడు ఓ వ్య‌క్తి.

వివ‌రాల్లోకి వెళ్తే.. నిర్మ‌ల్ జిల్లా( Nirmal Dist ) భైంసా మండ‌లం హజ్గుల్ గ్రామానికి చెందిన శ్యామ్ అనే వ్య‌క్తి ఇంట్లో ఓ పిచ్చుక వ‌చ్చింది. ఇంట్లో స్వేచ్ఛ‌గా విహ‌రిస్తూ.. ధాన్యం గింజ‌ల కోసం తిరుగుతుంది. దీంతో పిచ్చుక‌కు ఫ్యాన్ రెక్క త‌గ‌ల‌డంతో.. అది కింద ప‌డిపోయింది.

పిచ్చుక కింద ప‌డిపోవ‌డాన్ని చూసిన శ్యామ్‌.. వెంట‌నే దాన్ని త‌న చేతుల్లోకి తీసుకున్నాడు. పిచ్చుక‌కు ఊపిరి ఆడ‌టం లేద‌ని గ‌మ‌నించాడు. దీంతో మ‌న‌షుల‌కు సీపీఆర్ చేసిన మాదిరిగానే ఆ పక్షికి కూడా చేశాడు. కాసేప‌టికే పిచ్చుక స్పృహాలోకి వ‌చ్చింది.

శ్యామ్ త‌న దోసిట్లో నీటిని తీసుకొని పిచ్చుక‌కు తాగించాడు. ఆ త‌ర్వాత ఊపిరి తీసుకున్న పిచ్చుక గాల్లోకి స్వేచ్ఛ‌గా ఎగిరిపోయింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

Exit mobile version