Site icon vidhaatha

BJP Leader Murder | వాకింగ్ చేస్తుండ‌గా.. బీజేపీ నేత దారుణ హ‌త్య‌

BJP Leader Murder |

వాకింగ్ చేస్తున్న ఓ బీజేపీ నాయ‌కుడిని గుర్తు తెలియ‌ని దుండగులు తుపాకీతో కాల్చిచంపారు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మోరాబాద్ ప్రాంతంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.వివ‌రాల్లోకి వెళ్తే.. మొర‌దాబాద్‌కు చెందిన బీజేపీ నేత అనూజ్ చౌద‌రి త‌న సోద‌రుడితో క‌లిసి గురువారం సాయంత్రం త‌న ఇంటి ముందు వాకింగ్ చేస్తున్నారు.

అంత‌లోనే ఓ ముగ్గురు దుండ‌గులు ముఖానికి మాస్కులు ధ‌రించి బైక్‌పై వ‌చ్చారు. చౌద‌రిని అనుస‌రించి తుపాకీతో కాల్పులు జ‌రిపారు. దీంతో అత‌ను కింద ప‌డిపోవ‌డంతో, మ‌రో రెండు రౌండ్ల కాల్పులు జ‌రిపి ప‌రారీ అయ్యారు.

తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డుతున్న అనూజ్ చౌద‌రిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. తుపాకీతో కాల్పులు జ‌రిపిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

ఈ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. దుండ‌గుల‌ను ప‌ట్టుకునేందుకు పోలీసులు ఐదు బృందాల‌ను ఏర్పాటు చేశారు. ఇది రాజ‌కీయ హ‌త్యే అని మృతుడి కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు.

Exit mobile version