Bollywood | బికినీ వేసుకున్న తొలి బాలీవుడ్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Bollywood ష‌ర్మిలా ఠాగూర్‌, నూత‌న్‌, జీన‌త్ అమ‌న్ కారు హెలెన్‌, ప‌ర్వీన్ బాబీ, రేఖాకు అంత సీన్ లేదు.. తొలిసారి స్విమ్ సూట్ ఎవ‌రు ధ‌రించారో తెలుసా? అయితే, మీరు క‌చ్చితంగా ఈ స్టోరీ చ‌ద‌వాల్సిందే! విధాత‌: ఇప్పుడు సినిమాల్లో బికినీలు, స్విమ్‌సూట్లు కామ‌న్ అయ్యాయి.. కానీ, ఒక‌ప్పుడు వీటిని ధ‌రించేవారు చాలా అరుదు. అస‌లు బాలీవుడ్‌లో తొలిసారి బికినీ ఎవ‌రు వేశారో తెలుసా? 1967లో విడుద‌లైన యాన్ ఈవినింగ్ ఇన్ పారిస్, ఆమ్నే సామ్నే చిత్రాల్లో […]

  • Publish Date - June 20, 2023 / 05:25 AM IST

Bollywood

  • ష‌ర్మిలా ఠాగూర్‌, నూత‌న్‌, జీన‌త్ అమ‌న్ కారు
  • హెలెన్‌, ప‌ర్వీన్ బాబీ, రేఖాకు అంత సీన్ లేదు..
  • తొలిసారి స్విమ్ సూట్ ఎవ‌రు ధ‌రించారో తెలుసా?
  • అయితే, మీరు క‌చ్చితంగా ఈ స్టోరీ చ‌ద‌వాల్సిందే!

విధాత‌: ఇప్పుడు సినిమాల్లో బికినీలు, స్విమ్‌సూట్లు కామ‌న్ అయ్యాయి.. కానీ, ఒక‌ప్పుడు వీటిని ధ‌రించేవారు చాలా అరుదు. అస‌లు బాలీవుడ్‌లో తొలిసారి బికినీ ఎవ‌రు వేశారో తెలుసా? 1967లో విడుద‌లైన యాన్ ఈవినింగ్ ఇన్ పారిస్, ఆమ్నే సామ్నే చిత్రాల్లో న‌టించిన బాలీవుడ్ నటి, ఒకప్పటి సూపర్ స్టార్ షర్మిలా ఠాగూర్ తొలిసారి బికినీ ధ‌రించిన హీరోయిన్ అని అంద‌రూ అనుకుంటారు. కానీ, బికినీ ధరించిన మొదటి భారతీయ నటి ఆమె కానే కాదు.

బాలీవుడ్‌లో త‌మ ముద్ర వేసుకొన్న నూత‌న్‌, జీన‌త్ అమ‌న్, హెలెన్‌, ప‌ర్వీన్ బాబీ, రేఖా కూడా మొద‌టి సారి బికిని ధ‌రించ‌లేరు. 1938లో విడుద‌లైన‌ బ్రహ్మచారి అనే మరాఠీ చిత్రంలో మీనాక్షి శిరోద్కర్ మొద‌టి సారి బికినీ ధ‌రించారు. శిల్పా శిరోద్కర్‌, నమ్రతా శిరోద్కర్‌ల అమ్మమ్మ మీనాక్షి శిరోద్కర్. యమునా జలీ ఖేలు ఖేల్ అనే పాటలో మీనాక్షి బికినీ ధరించారు. ఆ సాంగ్‌లో ఆమె తన సహనటుడు మాస్టర్ వినాయక్‌ను సమ్మోహన పరుస్తూ క‌నిపిస్తారు.

బాలీవుడ్ నివేదికల ప్రకారం.. మీనాక్షి బికినీ ధ‌రించిన ఈ పాట హిందీలో కూడా డ‌బ్‌ చేశారు. ఈ పాట తర్వాత మీనాక్షి శిరోద్క‌ర్‌కు చాలా పేరు వ‌చ్చింది. ఆ త‌ర్వాత‌ మీనాక్షి, మాస్టర్ వినాయక్ బ్రాందిచి బాట్లీ (1939), అర్ధాంగి / ఘర్ కి రాణి (1940), అమృత్ (1941), మజే బాల్ (1943) చిత్రాల్లో కలిసి నటించారు. ఇంకొన్ని సినిమాల్లో కూడా ఈ జోడి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందింది.

స్విమ్‌సూట్‌ ధరించిన తొలి న‌టి నళిని జయవంత్

బాలీవుడ్‌లో స్విమ్‌సూట్‌ ధరించిన మొట్ట‌మొద‌టి న‌టి నళిని జయవంత్. ఈమె శోభనా సమర్థ్ మొదటి కోడలు. 1950లో విడుదలైన సంగ్రామ్ చిత్రంలో నళిని జయవంత్ స్విమ్ సూట్ ధరించారు. ఈ చిత్రంలో అశోక్ కుమార్ సరసన నళిని న‌టించారు.

ఆ త‌ర్వాత సంవ‌త్స‌రంలో విడుద‌లైన ఆవారా (1951) సినిమాలో నర్గీస్ కూడా స్విమ్ సూట్ ధరించారు. అనంత‌రం కామెడీ దిల్లీ కా థగ్ (1958) సినిమాలో నూతన్ కూడా స్విమ్‌సూట్ ధ‌రించారు. ఈ చిత్రంలో నూతన్ స్విమ్మర్‌గా నటించారు. ఈ చిత్రం త‌ర్వాత ఆమె పూర్తిగా సినీ ప‌రిశ్ర‌మ నుంచి నిష్క్రమించారు.