Site icon vidhaatha

వార‌ణాసి విమానానికి బాంబు బెదిరింపు!


విధాత‌: ముంబై-వార‌నాసి విమానంలో బాంబు ఉన్న‌ట్టు ఫోన్‌కాల్ రావ‌డంతో అత్య‌వ‌స‌రంగా వారనాసిలో అత్య‌వ‌స‌రంగా ల్యాండ్‌చేశారు. భ‌ద్ర‌తా సిబ్బంది విమానాన్ని క్షుణంగా త‌నిఖీ చేసినా ఎలాంటి పేలుడు వ‌స్తువు కూడా క‌నిపించ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.


విమానయాన సంస్థ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ముంబై నుంచి వారణాసికి అకాసా ఎయిర్‌లైన్ విమానం 159 మంది ప్రయాణికులు, ఒక శిశువు, ఆరు సిబ్బందితో సహా 166 మంది వ్యక్తుల‌తో శుక్ర‌వారం సాయంత్రం బ‌య‌లుదేరింది. విమానం ఎగిరిన‌కాసేటి త‌ర్వాత విమానంలో బాంబు ఉన్న‌ట్టు ఎయిర్‌పోర్టుకు స‌మాచారం అందింది.


అకాసా ఎయిర్ ఫ్లైట్ QP 1498కి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అత్యవసర హెచ్చరిక వచ్చింది. కెప్టెన్ అవసరమైన అన్ని అత్యవసర విధానాలను అనుసరించి వారణాసిలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. క్షుణ్ణంగా భద్రతా తనిఖీల తర్వాత, అభ్యంతరకరమైనది ఏమీ కనుగొనబడలేద‌ని వారణాసి ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ పునీత్ గుప్తా తెలిపారు. విమానం సురక్షితంగా ఉన్నట్టు వెల్ల‌డించారు. ఫేక్ ఫోన్‌కాల్‌పై ఎయిర్‌పోర్టు అధికారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

Exit mobile version