Site icon vidhaatha

Bro | మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఓటీటీలోకి బ్రో ఎప్ప‌టి నుంచి స్ట్రీమింగ్ అంటే..!

Bro |

థియేట‌ర్స్ లో విడుద‌లైన సినిమాలు నెల రోజుల త‌ర్వాత ఓటీటీలో సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. అభిమానులు థియేట‌ర్‌లో సినిమా చూసిన కూడా ఓటీటీలో స‌ద‌రు చిత్రం ఎప్పుడు వ‌స్తుందా అని క‌ళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తుంటారు. ఈ క్ర‌మంలో మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ అందించారు మేక‌ర్స్.

ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయిధ‌ర‌మ్ క‌లిసి చేసిన మెగా మ్యానియా చిత్రం బ్రో జూలై 28న విడుద‌ల కాగా ప్రేక్ష‌కుల నుండి మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. ఇద్ద‌రు మెగా హీరోలు క‌లిసి సినిమా చేసే స‌రికి చిత్రంపై చాలా మందికి ఆస‌క్తి నెల‌కొంది. ఈ చిత్రం త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన వినోద‌య సీత‌మ్ అనే చిత్రానికి రీమేక్‌గా రూపొంద‌గా, మూవీని ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని తెర‌కెక్కించారు.

మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. కేతిక శర్మ , ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అయితే చిత్రం అనుకున్నంత రేంజ్‌లో హిట్ కాక‌పోవ‌డంతో మూవీని ఓటీటీ విడుదలకు రంగం సిద్ధం చేశారు.

నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా వచ్చే శుక్రవారం (ఆగస్టు 25) నుంచి స్ట్రీమ్ చేయ‌బోతున్నారు. థియేట‌ర్స్‌లో సినిమా చూడ‌డం మిస్ అయిన వారు చ‌క్క‌గా ఓటీటీలో మూవీని వీక్షించి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. మనిషి జీవితకాలం సంపాదనపై పడి కుటుంబాన్ని, బంధాలను, బాధ్యతలను విస్మరించి బ్రతికేయడం సరైన పద్ధతి కాద‌నే విష‌యాన్ని మూవీలో చ‌క్క‌గా చూపించారు.

ఇక బ్రో స్టోరీ లైన్ చూస్తే.. తండ్రి చనిపోవడంతో ఇంటికి పెద్ద కొడుకైన మార్క్ అలియాస్ మార్కండే యులు (సాయిధ‌ర‌మ్ తేజ్) ఇంటి బాధ్య‌త‌ల‌ని మోస్తుంటాడు. ఇద్ద‌రు చెల్లెళ్లు, త‌మ్ముడుతో పాటు త‌ను కూడా మంచి స్థాయిలో ఉండాల‌ని ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటాడు.

ఓ రోజు అనుకోకుండా రోడ్డు ప్ర‌మాదంలో మార్కండేయులు మ‌ర‌ణించ‌డంతో ఆయ‌న త‌న ఆవేద‌న‌ని దేవుడుకి విన్న‌వించుకుంటాడు. త‌న వాళ్లు ఎవ‌రు కూడా జీవితంలో స్థిర‌ప‌డ‌లేద‌ని, తాను చేయాల్సిన ఎన్నో ప‌నులు మిగిలిపోయాయ‌ని..ఇలా త‌న జీవితానికి తొంద‌ర‌గా ముగింపు ప‌ల‌క‌డం అన్యాయం అంటూ సాయి దేజ్ మొర‌పెట్టుకోగా, 90 రోజులు అత‌డి జీవిత‌కాలాన్ని పెంచుతాడు. అలా మ‌ళ్లీ ఇంటికి చేరిన మార్క్ 90 రోజుల్లో ఏమేం చేశాడు అనేది చిత్ర క‌థ‌.

Exit mobile version