విధాత: భారత రాష్ట్ర సమితి (BRS)ని మరింత బలోపేతం చేయాలి. ప్రజాప్రతినిధులు వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీలతో టెలీ కాన్ఫరెన్స్ (Tele conference) నిర్వహించారు.
పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి. నాయకులందరి మధ్య ఆత్మీయ అనుబంధం బలోపేతం కావాలని సూచించారు.
ప్రతి 10 గ్రామాలు యూనిట్‌గా ఆత్మీయ సమ్మేళనాలు జరపాలని, నేతలు ఈ సమ్మేళనాలను 2 నెలల్లోపు పూర్తి చేయాలని కేటీఆర్ అన్నారు. జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు అన్నీ ప్రారంభించుకోవాలి. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దామన్నారు.
పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ఏప్రిల్ 25న నియోజకవర్గాల్లో పార్టీ ప్రతినిధుల సమావేశాలు నిర్వహించాలన్నారు. బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం పలు కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు.