Site icon vidhaatha

Bull | వ్యక్తిని వెంటాడిన ఎద్దు.. రెండు గంటలు చెట్టుపైనే!

Bull

విధాత: ఆ ఎద్దుకు ఓ వ్యక్తిపై ఎందుకోచ్చిందో అంత కోపంగాని అతడిపై దాడి చేసి చెట్టు ఎక్కినా నిన్ను వదలబోనంటు రంకలేసి భయభ్రాంతులకు గురి చేసిన విచిత్ర సంఘటన యూపీలోని బల్లియా జిల్లాలో చోటుచేసుకుంది.

ఓ వ్యక్తిపై అక్కడే ఉన్న ఎద్దు ఆకస్మికంగా దాడి చేసింది. దాంతో అతను ఎద్దు దాడి నుంచి తప్పించుకునేందుకు పరుగెత్తి భయంతో సమీపంలో ఉన్న చెట్టు ఎక్కాడు. అయినప్పటికీ ఆ ఎద్దు అతన్ని వదలకుండా ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ కోపంతో ఊగిపోయింది.

కాగా.. ఆ వ్యక్తిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించి, ఎద్దును అదిలించినప్పటికీ అది బెదరకుండా అతని పై పగపట్టిన మాదిరిగా ఎప్పుడు చెట్టు దిగుతాడా కుమ్మేద్దామన్నట్లు చెట్టు వద్దనే వేచి చూసింది.

దీంతో చేసేదేమీ లేక బాధితుడు రెండు గంటల పాటు చెట్టు పైనే ఉండిపోగా, ఎద్దు కోపం చల్లారి అక్కడి నుంచి వెళ్లాక అతను కిందకు దిగి బతుకు జీవుడా అనుకుంటు ఇంటి బాట పట్టాడు. ఇప్పుడు ఆ ఎద్దు వీరంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోండటం విశేషం.

Exit mobile version