Site icon vidhaatha

Talking fish: మాట్లాడే చేపలు.. ఇవి ఎక్కడ ఉన్నాయో తెలుసా..?

Talking fish: మనుషులు కాకుండా మాట్లాడే ఇతర జంతువులు ఉన్నాయా.. రామచిలుకలు మాట్లాడతాయని.. మరికొన్ని పక్షులు కూడా మాట్లాడతాయని అప్పుడప్పుడు మనం వార్తల్లో చదువుతుంటాం. అయితే కొన్ని రకాల చేపలు కూడా మాట్లాడుకుంటాయని.. విభిన్నమైన శబ్ధాలు చేస్తూ కమ్యూనికేట్ చేసుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను కూడా సైంటిస్టులు గుర్తించారు. కొన్ని రకాల చేపలు వివిధ రకాల శబ్ధాలను చేస్తూ ఒకదానితో మరొకటి కమ్యూనికేట్ చేసుకుంటాయట. గ్రంటర్ ఫిష్ అనే చేపలు గొంతు నుండి గర్జన లాంటి శబ్దాలను విడుదల చేస్తాయి. క్రోకర్ ఫిష్ ఇవి డ్రమ్ బీట్ లాంటి శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. మిడ్నైట్ స్నాప్పర్ (Midnight Snapper) రాత్రి సమయంలో ఈ చేపలు సంగీతం లాగా శబ్దాలు చేస్తాయి.

మాట్లాడే చేపలు ఎక్కడున్నాయి?

ఈ చేపలు ప్రధానంగా ఆస్ట్రేలియా, ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో ఉన్నాయని సైంటిస్టులు గుర్తించారు. కరిబియన్ సముద్రాలు, అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపిస్తాయి. ఇవి సాధారణంగా చిన్న గుంపులుగా ఉండి, సముద్రపు అడుగుభాగంలోని కొండచరియలు, పాచి ప్రాంతాల్లో నివసిస్తాయి. చేపలు తమ స్విమ్ బ్లాడర్ (గాలితిత్తి), పళ్ళు, ఎముకలు వంటి అవయవాలను ఉపయోగించుకుని శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ శబ్ధాలు సహచర చేపలను హెచ్చరించడానికి లేదా సంభోగ సమయంలో కొన్ని రకాలైన శబ్ధాలు చేస్తూ ఉంటాయట.

ప్రస్తుతం సముద్ర జీవశాస్త్రవేత్తలు ఈ చేపల శబ్దాలను రికార్డ్ చేస్తున్నారు. వాటి అర్థాలను అధ్యయనం చేస్తున్నారు. భవిష్యత్తులో “చేపల భాష” ను అర్థం చేసుకోవడం వల్ల సముద్ర పర్యావరణ వ్యవస్థను బాగా అర్థం చేసుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.

 

Exit mobile version