Site icon vidhaatha

Viveka murder case | వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు

Viveka murder case | విధాత : మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Redd) కి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో నేడు ఆయన సీబీఐ కోర్టుకు హాజరు కానున్నారు. సీబీఐ (CBI) కోర్టు గత నెల 14న కోర్టుకు హాజరు కావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి సమన్లు జారీ చేసింది. వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీటును పరిగణనలోకి తీసుకుంది. అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై చార్జిషీట్ వేసిన సీబీఐ వివేకా హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా అవినాష్ రెడ్డిని చేర్చింది.

వివేకా హత్య కేసులో 145 పేజీల తో మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సీబీఐ. ఇక అవినాష్ రెడ్డి జూన్ 19 తేదీన సీబీఐ డైరెక్టర్ కు రాసిన లేఖలో దర్యాప్తు ను పునః సమీక్షించాలని కోరారు. గత దర్యాప్తు అధికారి రాంసింగ్ పై ఆరోపణలు చేసిన అవినాష్ రెడ్డి తనపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తు సరిగ్గా జరగలేదని లేఖలో పేర్కొన్న అవినాష్ రెడ్డి వాటిపై మరోసారి పునః పరిశీలన చేయాలని లేఖ లో కోరారు. ఇక ఈ లేఖ పై సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Exit mobile version