IRCTC scam case । ఐఆర్‌సీటీసీ స్కామ్‌లో రబ్రీదేవిని ప్రశ్నించిన సీబీఐ

మా ఇంట్లో ఈడీ, సీబీఐ ఆఫీసులు తెరుచుకోండన్న తేజస్వి విధాత : ఐఆర్‌సీటీసీ(IRCTC) కుంభకోణం విషయంలో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి(former Bihar CM Rabri Devi)ని సీబీఐ అధికారులు సోమవారం ప్రశ్నించారు. ఆమె కుమారుడు, బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ (Deputy CM Tejashwi Yadav) అసెంబ్లీకి వెళ్లిన అనంతరం సీబీఐ అధికారులు రబ్రీదేవి ఇంటికి వెళ్లారని సమాచారం. ఐఆర్‌సీటీసీ కుంభకోణంపై ఆమెను ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. ఢిల్లీ కోర్టు ఐఆర్‌సీటీసీ కుంభకోణం కేసు (IRCTC […]

  • Publish Date - March 6, 2023 / 01:12 PM IST

  • మా ఇంట్లో ఈడీ, సీబీఐ ఆఫీసులు తెరుచుకోండన్న తేజస్వి

విధాత : ఐఆర్‌సీటీసీ(IRCTC) కుంభకోణం విషయంలో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి(former Bihar CM Rabri Devi)ని సీబీఐ అధికారులు సోమవారం ప్రశ్నించారు. ఆమె కుమారుడు, బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ (Deputy CM Tejashwi Yadav) అసెంబ్లీకి వెళ్లిన అనంతరం సీబీఐ అధికారులు రబ్రీదేవి ఇంటికి వెళ్లారని సమాచారం. ఐఆర్‌సీటీసీ కుంభకోణంపై ఆమెను ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. ఢిల్లీ కోర్టు ఐఆర్‌సీటీసీ కుంభకోణం కేసు (IRCTC scam case)లో ఆర్జేడీ అధినేత, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్‌ యాదవ్‌ (RJD Chief Lalu Prasad Yadav), ఆయన భార్య రబ్రీదేవికి సమన్లు జారీ చేసిన నేపథ్యంలో సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నించడం గమనార్హం.

సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్న సమయంలో లాలు చిన్న కుమారుడు, రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఇంటి నుంచి బయటకు వచ్చినా.. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఆ తర్వాత ఒక మహిళా న్యాయవాది వారి ఇంట్లోకి వెళ్లారు. ఈ వ్యవహారంపై తేజస్వీ యాదవ్‌ మాట్లాడుతూ.. తాను ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో సీబీఐ అధికారులు వచ్చి తనిఖీలు (search operation) చేశారని చెప్పారు. మీడియాతో వార్తలు రావడంతోనే తనకు ఆ విషయం తెలిసిందన్నారు. ఈ తనిఖీలు బీజేపీ పురమాయించినవేనని ఆయన ఆరోపించారు.

‘ఇదేమీ నాకు కొత్త కాదు. ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి సీబీఐ అధికారులు మా ఇంటికి వస్తుంటారు. తనిఖీలు చేస్తుంటారు. కానీ..ఇప్పటి వరకు ఒక్క సాక్ష్యాన్ని కూడా సేకరించలేక పోయారు’ అని అన్నారు. సీబీఐ, ఈడీలు తమ ఇంట్లో కార్యాలయాలు తెరుచుకోండని గతంలో చెప్పిన తేజస్వి.. అవే మాటలు పునరుద్ఘాటించారు. వారు వారి కార్యాలయాలను తమ ఇంట్లో పెట్టుకుంటే ప్రభుత్వానికి డబ్బు ఆదా అవుతుందని చురకలు వేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ద్వారా బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు (Political vendetta) పాల్పడుతున్నదని జేడీయూ సీనియర్‌ నేత కేసీ త్యాగి (KC Tyagi) ఆరోపించారు.

Latest News