Site icon vidhaatha

మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట: కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా

విధాత, మెదక్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కేంద్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా అన్నారు.

మెదక్ పట్టణంలోని సాయి బాలాజీ గార్డెన్ లో సోమ‌వారం ఏర్పాటుచేసిన పార్లమెంట్ స్థాయి ప్రభాస్ యోజన కార్యక్రమంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో మంత్రిత్వ శాఖ నూతనంగా ఏర్పాటు చేసి రెండు, మూడు వేల కోట్ల బడ్జెట్ ఉన్న శాఖను 20 వేల కోట్లకు బడ్జెట్ పెంచడం జరిగిందని తెలిపారు…

అంతేకాకుండా మత్స్యకారుల సంక్షేమానికి అనేక ర‌కాల చర్యలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేప‌ట్టిన‌ పాదయాత్ర రాష్ట్రంలో జోష్ పెంచిందన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో ముందుకెళుతున్నట్లు తెలిపారు.

తెలంగాణలో ప్రధానమంత్రి నేతృత్వంలో ప్రతి గ్రామంలో కార్యకర్తల నమోదు చేయ‌డంతో పాటు తెలంగాణలో ప్రభుత్వ పాలన ఉంటుందన్నారు.

కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీను, నల్లాల విజయ్, అక్కలదేవి మధు, రాష్ట్ర, జిల్లా నాయకులు జనార్దన్ రెడ్డి, మల్లారెడ్డి, నందరెడ్డి, సిద్దిరాములు, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, జిల్లా నియోజక వర్గ నాయకులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Exit mobile version