తిరువనంతపురం: కేరళ సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ ఇఫ్టికర్ అహ్మద్‌పై విద్యార్థులు యూనివర్సిటీ ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇంగ్లీష్ లిటరేచర్ బోధించే ఆ ప్రొఫెసర్.. ఆ పద్యాలను శృంగారానికి అన్వయిస్తూ బోధన చేస్తున్నారని విద్యార్థులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ కొనసాగుతోందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
అసలేం జరిగిందంటే..?
నవంబర్ 13వ తేదీన ఎగ్జామ్ రాస్తుండగా ఎంఏ ఫస్టియర్ విద్యార్థిని స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఎగ్జామ్ డ్యూటీలో ఉన్న ఇన్విజిలేటర్ డాక్టర్ ఇఫ్తికర్ అహ్మద్ అక్కడికి చేరుకున్నాడు. బాధిత విద్యార్థినిని యూనివర్సిటీ హెల్త్ సెంటర్‌కు తరలించే క్రమంలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తాకరాని చోట తాకేందుకు యత్నించాడు. దీంతో బాధితురాలు తోటి విద్యార్థులకు చెప్పుకొని ఆవేదనకు గురైంది.
ఇక ఇప్పటికే తరగతి గదుల్లో శృంగారం గురించి ఎక్కువగా డిస్కస్ చేసి, ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రొఫెసర్‌పై 31 పేజీల ఫిర్యాదును యూనివర్సిటీ ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీకి అందజేశారు. శృంగార కావ్యాల గురించి పాఠాలు చెబుతూ.. ఆ ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. శృంగార రచన పేరుతో ఆ ప్రొఫెసర్ చాలా నీచంగా మాట్లాడుతున్నట్ల విద్యార్థులు ఆరోపించారు.
మహిళల్ని ఓ శృంగార వస్తువుగా ట్రీట్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక బస్సు కండక్టర్ చాలా తృఫ్తి చెందుతాడని, ఎందుకంటే అతను నిత్యం మమిళలను తాకుతాడని ప్రొఫెసర్ బోధించినట్లు తెలిపారు. తాగిన మైకంలో విద్యార్థిని ప్రొఫెసర్ టచ్ చేసినట్లు మహిళా మెడికల్ ఆఫీసర్ ఆరోపించారు. ఫస్ట్ ఇయర్ క్లాసులో ఉన్న 41 మంది విద్యార్థుల్లో 33 మంది ఆ ఫ్రొఫెసర్‌కు వ్యతిరేకంగా సంతకం చేశారు