Site icon vidhaatha

AP CM Chandrababu: తల్లికివందనం.. అన్నదాత సుఖీభవ పథకాలపై చంద్రబాబు కీలక ప్రకటన

AP CM Chandrababu:  సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా? అని ఏపీ ప్రజలు వేయికండ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పింఛన్లను అమలు చేస్తున్న ప్రభుత్వం.. మిగిలిన పథకాలకు సంబంధించి క్లారిటీ ఇవ్వడం లేదు.

ఆగస్ట్ 15 నుంచి మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ పథకాన్ని అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తాజాగా తల్లికివందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. జగన్ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు అమ్మఒడి పేరిట ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే రూ. 15000 ఇచ్చేవారు. కాగా తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి రూ. 15000 ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. దీంతో ఈ పథకం అమలు కోసం తల్లులంతా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. జూన్ నెలలోనే తల్లికివందనం పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో హామీ ఇచ్చినట్టుగా ఆగస్ట్ 15న ఉచిత బస్ పథకం మహిళలకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా ఇదే నెలలో అమలు చేస్తామని చెప్పారు.

అయితే ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలు సమస్యలు తెలుసుకోవాలని.. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు సూచించారు.

 

Exit mobile version