Site icon vidhaatha

Chandrayaan 3 | చంద్రుని ఉష్ణోగ్రతలను పంపిన చంద్రయాన్ 3

Chandrayaan 3 |

విధాత: చంద్రయాన్ -3 విక్రమ్ ల్యాండర్‌లోని ఛేస్ట్ పేలోడ్ చంద్రుని దక్షిణ దృవంపై తిరుగాడుతూ ఉష్ణోగ్రతల నమోదు వివరాలను పంపించింది. చంద్రుని దక్షిణ దృవంపై ఉష్ణోగ్రతల వివరాలు వెల్లడవ్వం ఇదే మొదటిసారని ఇస్రో తెలిపింది.

చంద్రుని ఉపరితలం నేల ఉష్ణోగ్రతలు 10సెంటిమీటర్ల లోతు వరకు వెళ్లి ఉష్ణోగ్రతలను కొలిచే పరికరాలను ఛేస్ట్ పేలోడ్(చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్‌)లో అమర్చి ఉన్నాయని ఇస్రో తెలిపింది. ఛేస్ట్ పేలోడ్ చంద్రుని ఉపరితలంపై వేర్వేరు లోతుల్లో ఉన్నప్పుడు ఉష్ణోగ్రతల తేడాల నమోదు చేసి పంపిన ఓ గ్రాప్‌ను కూడా ఇస్రో ట్వీట్ చేసింది.

Exit mobile version