ISRO Scientist | ఇస్రో.. కౌంట్‌డౌన్ వినిపించే ఉద్యోగిని కన్నుమూత

ISRO Scientist | భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ‌(ISRO) కౌంట్ డౌన్ స్వ‌రం మూగబోయింది. ఇస్రోలో రాకెట్ ప్ర‌యోగాల వేళ కౌంట్‌డౌన్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. గంభీర‌మైన స్వ‌రంతో కౌంట్‌డౌన్ వినిపించే ఇస్రో ఉద్యోగిని వాల‌ర్‌మ‌తి(50) గుండెపోటుకు గురై చ‌నిపోయారు. వాల‌ర్‌మ‌తి శ‌నివారం తుది శ్వాస విడిచిన‌ట్లు ఆమె కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఇస్రో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జులై నెల‌లో నిర్వ‌హించిన చంద్ర‌యాన్‌-3 ప్ర‌యోగంలో ఆమె చివ‌రిసారిగా కౌంట్‌డౌన్ వినిపించారు. అంత‌కుముందు అనేక ప్ర‌యోగాల్లోనూ ఆమె కౌంట్‌డౌన్ […]

  • Publish Date - September 4, 2023 / 10:42 AM IST

ISRO Scientist |

భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ‌(ISRO) కౌంట్ డౌన్ స్వ‌రం మూగబోయింది. ఇస్రోలో రాకెట్ ప్ర‌యోగాల వేళ కౌంట్‌డౌన్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. గంభీర‌మైన స్వ‌రంతో కౌంట్‌డౌన్ వినిపించే ఇస్రో ఉద్యోగిని వాల‌ర్‌మ‌తి(50) గుండెపోటుకు గురై చ‌నిపోయారు. వాల‌ర్‌మ‌తి శ‌నివారం తుది శ్వాస విడిచిన‌ట్లు ఆమె కుటుంబ స‌భ్యులు తెలిపారు.

ఇస్రో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జులై నెల‌లో నిర్వ‌హించిన చంద్ర‌యాన్‌-3 ప్ర‌యోగంలో ఆమె చివ‌రిసారిగా కౌంట్‌డౌన్ వినిపించారు. అంత‌కుముందు అనేక ప్ర‌యోగాల్లోనూ ఆమె కౌంట్‌డౌన్ బాధ్య‌తలు నిర్వ‌ర్తించారు. 1959లో త‌మిళ‌నాడులోని అరియ‌లూరులో జ‌న్మించిన ఆమె.. 1984లో ఇస్రోలో శాస్త్ర‌వేత్త‌గా చేరారు.

వాల‌ర్‌మ‌తి మృతిపై ఇస్రో మాజీ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ పీవీ వెంక‌ట‌కృష్ణ‌న్ స్పందించారు. వాల‌ర్‌మ‌తి మృతిప‌ట్ల సంతాపం ప్ర‌క‌టించారు. ఆమె కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. శ్రీహ‌రికోట నుంచి ఇస్రో భ‌విష్య‌త్ మిష‌న్ల కౌంట్‌డౌన్‌ల‌కు వాల‌ర్‌మ‌తి మేడం వాయిస్ ఉండ‌దు. చంద్ర‌యాన్-3 ఆమె చివ‌రి కౌంట్‌డౌన్ ప్ర‌క‌ట‌న‌. ఊహించ‌ని మ‌ర‌ణం.. చాలా బాధ‌గా అనిపిస్తుంద‌ని వెంక‌ట‌కృష్ణ‌న్ ట్వీట్ చేశారు.

ఇస్రోలో ప్రయోగించిన రాకెట్ ప్రయోగాల లాంచింగ్ కౌంట్‌డౌన్ ఆమే చెప్పేవారు. ఇలా ఆమె విలక్షణమైన కంఠం దేశ ప్రజలకు సుపరిచితంగా మారింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని ఆమె మొదటిసారిగా 2015లో అందుకున్నారు.

Latest News