విధాత: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ‘మిచాంగ్’తో పలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోనూ మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. పెను తుఫాను కారణంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
తాజాగా నేడు మరో 13 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సూళ్లూరుపేట – నెల్లూరు (06745), నెల్లూరు – సూళ్లూరుపేట (06746), నెల్లూరు – సూళ్లూరుపేట (06750), సూళ్లూరుపేట – నెల్లూరు (06751), నెల్లూరు – సూళ్లూరుపేట (06748), సూళ్లూరుపేట – నెల్లూరు (06749), చెన్నై సెంట్రల్ – తిరుపతి (16053), చెన్నై సెంట్రల్ – ముంబయి లోకమాన్య తిలక్ (22180), చెన్నై సెంట్రల్ – బిట్రగుంట (17238), చెన్నై సెంట్రల్ – తిరుపతి (16203), తిరుపతి – చెన్నై సెంట్రల్ (16204), తిరురాచిపల్లి – హౌరా (12664), కోయంబత్తూరు – బరౌని (06059) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది.
వీటితో పాటు ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినస్- చెన్నై సెంట్రల్ (22159), చెన్నై సెంట్రల్ – ముంబయి సీఎస్‌ఎంటీ (22160), ముంబయి ఎల్‌టీటీ- చెన్నై సెంట్రల్ (22179), చెన్నై సెంట్రల్ – ముంబయి ఎల్‌టీటీ (22180) రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆయా రైళ్లు రేణిగుంట రైల్వేస్టేషన్‌లో ఆగవని వివరించింది.