Site icon vidhaatha

CM KCR | దేశ‌మే ఆశ్చ‌ర్య‌పోయేలా ఉద్యోగుల‌కు పే స్కేలు.. మ‌ళ్లీ జీతాలు పెంచుతాం : సీఎం కేసీఆర్

CM KCR |

దేశ‌మే ఆశ్చ‌ర్య‌పోయేలా తెలంగాణ ఉద్యోగుల‌కు పే స్కేల్ ఇస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ శాస‌న‌స‌భ వేదికగా ప్ర‌క‌టించారు. తక్కువ సమయంలోనే ఐఆర్‌ ఇచ్చి.. పీఆర్సీ అపాయింట్‌ చేస్తామ‌ని కేసీఆర్ పేర్కొన్నారు. రెకమెండేషన్‌ను బట్టి.. మరోసారి దివ్యంగా జీతాలుపెంచుతాం. ఇప్పటికే 70శాతం పెంచుకున్నాం. మళ్లీ మంచి పర్సంటేజీతో జీతాలు పెంచుతామ‌ని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం- సాధించిన ప్ర‌గ‌తిపై శాస‌న‌స‌భ‌లో చేప‌ట్టిన స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ‌పై కేసీఆర్ ప్ర‌సంగించారు.

భారత్‌లో అత్యధికంగా జీతాలు పొందేది తెలంగాణ ఉద్యోగులు మాత్ర‌మే అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఉద్యమ సమయంలో నేను చెప్పాను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పాం.. ఆ మాటను నిలబెట్టుకున్నాం. మాకు మానవీయ దృక్పథం ఉన్నది. కాంగ్రెస్‌, మ‌రే ఇత‌ర పార్టీ ఇవ్వలేదు. 30 శాతం పీఆర్సీ ఉద్యోగులకు ఇస్తే.. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సైతం 30 శాతం జీతాలు పెంచామ‌ని తెలిపారు.

భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి పెంచడం. శాసనసభలో పని చేసే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సైతం పెంచాం. ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడాం. తక్కువ సమయంలో పీఆర్సీ అపాయింట్‌ చేస్తాం. మా ఉద్యోగులు చమటోడుస్తున్నరు. మా ఇంజినీర్ల పుణ్యం ప్రాజెక్టుల్లో నీళ్లు కనబడుతున్నయ్‌. మా ఫారెస్ట్‌ ఆఫీసర్ల పుణ్యంతో వనాలు పెరుగుతున్నయ్‌. వ్యవసాయ అధికారుల పుణ్యంతో కోట్ల టన్నుల ధాన్యం పండుతున్నది అని కేసీఆర్ పేర్కొన్నారు.

అనేక రకాల రెగ్యులరేటరి అధికారులు, ఎక్సైజ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నరని కేసీఆర్ తెలిపారు. కమర్షియల్‌ టాక్స్‌ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది ? ఒకనాడు ఎంత నేడు ఎంత ? రిజిస్ట్రేషన్స్‌లో ఒకనాడు ఆదాయం ఎంత.. ఇవాళ ఎంత ? ఉద్యోగులు శ్రమతో డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి.. వాళ్ల సొమ్ములో వారికి వాటా ఇచ్చి.. ప్రజలతో పాటు కడుపునిండా అన్నం పెట్టుకుంటున్నాం. దేశం ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పే స్కేల్‌ ఇస్తాం. బ్రహ్మాండంగా జీతాలు పెంచుకుంటాం అని తెలుపుతూ కేసీఆర్ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

Exit mobile version