CM KCR | తెలంగాణ‌లో ఆక‌లి లేదు.. ఆత్మ‌హ‌త్య‌లు లేవు: సీఎం కేసీఆర్

CM KCR | తెలంగాణ రాష్ట్రంలో ఆక‌లిచావులు లేవ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో బ్ర‌హ్మాండ‌మైన అభివృద్ధి కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. సూర్యాపేట జిల్లా నూత‌న క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించిన అనంత‌రం కేసీఆర్ ఉద్యోగుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. సూర్యాపేట‌లో ఇవాళ రూ. 100 కోట్ల వ్య‌యంతో ఈ భ‌వ‌నాల‌ను నిర్మించుకున్నామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా జిల్లా ప్ర‌జ‌ల‌ను, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను హృద‌య‌పూర్వ‌కంగా అభినందిస్తున్నాను. సూర్యాపేట‌ జిల్లా కావాడ‌మే ఒక చ‌రిత్ర. అద్భుత‌మైన ప‌నితీరును ప్ర‌ద‌ర్శిస్తున్నాం. త‌ల‌స‌రి ఆదాయంలో తెలంగాణ నంబ‌ర్ […]

  • Publish Date - August 20, 2023 / 11:26 AM IST

CM KCR |

తెలంగాణ రాష్ట్రంలో ఆక‌లిచావులు లేవ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో బ్ర‌హ్మాండ‌మైన అభివృద్ధి కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. సూర్యాపేట జిల్లా నూత‌న క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించిన అనంత‌రం కేసీఆర్ ఉద్యోగుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

సూర్యాపేట‌లో ఇవాళ రూ. 100 కోట్ల వ్య‌యంతో ఈ భ‌వ‌నాల‌ను నిర్మించుకున్నామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా జిల్లా ప్ర‌జ‌ల‌ను, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను హృద‌య‌పూర్వ‌కంగా అభినందిస్తున్నాను. సూర్యాపేట‌ జిల్లా కావాడ‌మే ఒక చ‌రిత్ర. అద్భుత‌మైన ప‌నితీరును ప్ర‌ద‌ర్శిస్తున్నాం.

త‌ల‌స‌రి ఆదాయంలో తెలంగాణ నంబ‌ర్ వ‌న్‌గా ఉంది. ప‌ర్ క్యాపిట ప‌వ‌ర్‌లోనూ మ‌నం నంబ‌ర్ వ‌న్‌గా ఉన్నాం. వీట‌న్నింటికి కార‌ణం అధికారులే. కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి భ‌వ‌నాలు లేవు. ఇంత అద్భుతం జ‌రిగిందంటే మీ కృషినే. అమెరికా నుంచి తేలేదు ఉద్యోగ‌స్తుల‌ను. అదే పాత ఉద్యోగులు, అధికారులు, ఐఏఎస్ ఆఫీస‌ర్లు ఉన్నారు. జ‌ట్టుక‌ట్టి ప‌ని చేస్తే ఫ‌లితాలు ఎలా ఉంటాయనేది ఈ ప‌నుల వ‌ల్ల తెలుస్తుంది. తెలంగాణ ప్ర‌గ‌తికి ప్ర‌బ‌ల నిద‌ర్శ‌నం ఇది.

ప‌నిమంతులు, బుద్ధిమంతులు, ప్ర‌గ‌తి కాముకులు రిలాక్స్ కాకుకూడ‌దు. మ‌నం సాధించిన ప్ర‌గ‌తితో ఇక్క‌డే ఆగిపోవ‌ద్దు. ఇంకా చాలా అద్భుతాలు జ‌ర‌గాలి. సాంఘియ‌, ఆర్థిక‌, అస‌మాన‌త‌లు త‌గ్గాలి. ప్ర‌జ‌లు చాలా గొప్ప‌గా గ‌ర్వంగా జీవించే రోజులు రావాలి. ఇవాళ తెలంగాణ‌లో ఆక‌లి లేదు. ప‌స్తులు ఉండే ప‌రిస్థితి లేదు. హృద‌యాన్ని పిండే సంఘ‌ట‌న‌లు గతంలో ఉండేవి.

ఇప్పుడు అలాంటి సంఘ‌ట‌న‌లు లేవు. ఆత్మ‌హ‌త్య‌లు లేవు. బ్ర‌హ్మాండంగా ప్ర‌జ‌లు బ‌తుకుతున్నారు. ప‌ట్టుబ‌ట్టి మిష‌న్ భ‌గీర‌థ ద్వారా నీళ్లు తీసుకొచ్చాం. దుశ్చ‌ర్ల స‌త్య‌నారాయ‌ణ త‌న బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి స‌మాజం కోసం పోరాడారు. రాష్ట్రం ఇవాళ జీరో ఫ్లోరోసిస్ రాష్ట్రంగా నిలిచింది.

ఈ విష‌యాన్ని కేంద్ర‌మే అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇండియాలో ఎక్కడా లేని విధంగా జిల్లాకో మెడిక‌ల్ కాలేజీని ఏర్పాటు చేసుకున్నాం. విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. ఈ కృషి ఇలాగే కొన‌సాగాల‌ని ప్రార్థిస్తున్నాను అని సీఎం కేసీఆర్ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

Latest News