Site icon vidhaatha

స్టాలిన్ కుమార్తె పూజలు.. నెటిజన్ల సెటైర్లు

విధాత, సనాతన ధర్మంపై ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఆయన కుమారుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు దేశంలో సృష్టించిన రచ్చ అంతాఇంతా కాదు. అది అలా ఉండగానే స్టాలిన్ కుమార్తె సెంథామరై సోమవారం మైలాడుతురై జిల్లా సిర్కాజీలోని సత్తెనాథర్ గుడిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఇంకేముంది ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు స్టాలిన్ కుమార్తె పూజలను ప్రస్తావిస్తూ ఇది సనాతన ధర్మం కాదా అంటూ ఉదయనిధిని ప్రశ్నిస్తూ వీరిదో కన్ఫూజన్ ఫ్యామిలీ అంటూ నెట్టింట విమర్శల కామెంట్లు పెడుతున్నారు. అంతకు ముందు స్టాలిన్ తల్లి పూజల అంశాన్ని కూడా నెటిజన్లు ఇలాగే ప్రశ్నించారు.

Exit mobile version