CM Revanth Reddy | నేను హైటెన్ష‌న్ వైర్.. కేసీఆర్ ట‌చ్ చేస్తే కాకిలా మాడిపోతావ్‌

20 మంది ఎమ్మెల్యే లు చిటికెస్తే వస్తారని కేసీఆర్ పిట్టల దొర మాటలు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యే ల కంచెకు హై టెన్షన్ కరెంట్ వైరుల కాపలా కాస్తానని.. ఒక్క సారి ఈ వైరు ను తాకి చూస్తే కేసీఆర్ కాకి ల మాడి నల్లగా మారిపోతారని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

  • Publish Date - April 19, 2024 / 05:11 PM IST

ఒక్క సారి తాకి చూస్తే కాకి ల మాడిపోతావని కేసీఆర్కు హెచ్చరిక
కాంగ్రెస్ ఎమ్మెల్యే లను టచ్ చేసి చూడు.. మాడి మసి అయిపోతావు
ముందు నీ దొడ్లో ఎమ్మెల్యే లను కాపాడుకో.. రోజూ సాయంత్రం లెక్క పెట్టుకో
20 మంది ఎమ్మెల్యే లను తీసుకెళ్లే దైర్యం, దమ్ము కేసీఆర్ లేదు.. పిట్టల దొరలామాట్లాడుతున్నారు
కారు షెడ్డు కు కాదు.. తుక్కుకు అమ్ముడే
గద్వాల గడి, గజ్వెల్ ఫార్మ్ హౌస్ గడిల నేతలను తరిమి కొట్టాలి
పాలమూరు కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : 20 మంది ఎమ్మెల్యేలు చిటికెస్తే వస్తారని కేసీఆర్‌ పిట్టల దొర మాటలు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంచెకు హై టెన్షన్ కరెంట్ వైరులా కాపలా కాస్తానని.. ఒక్కసారి ఈ వైరును తాకి చూస్తే కేసీఆర్‌ కాకిలా మాడిపోతారని హెచ్చరించారు. చిటికె కాదుగదా మిద్దె ఎక్కి డప్పుకొట్టిన అరిచినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కంచె దాటరని విశ్వాసం వ్యక్తం చేశారు. వంద రోజుల పాలనపై కేసీఆర్‌ పిట్టల దొరలా మాట్లాడుతున్నారని అన్నారు. ‘ఢిల్లీలో మోదీని చూశాం.. ఇక్కడ గల్లీలో కేసీఆర్‌ అనే కేడీని చూశాం.. ఈ గడ్డమీద ఎగిరేది మన జెండానే’ అని రేవంత్ రెడ్డి చెప్పారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ ప్రాంతంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గతంలో కేసీఆర్‌ ముఠా తోడేళ్ల మాదిరిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పడ్డారని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాపలాగా ఉన్నాడని, ఇప్పుడు కేసీఆర్‌కు దమ్ము, దైర్యం ఉంటే ఒక్క ఎమ్మెల్యేను టచ్ చేసి చూస్తే ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కారును బండకేసి కొట్టి వంద అడుగుల లోతున పాతిపెట్టారని చెప్పారు. కానీ.. కేటీఆర్ మాత్రం కారు రిపేర్ కోసం షెడ్డుకు వెళ్లిందని అంటున్నారని, కారు షెడ్డుకు కాదు పూర్తిగా ఇంజిన్ చెడిపోయి ఖరాబు అయిందని, ఆ కారును తుక్కుకు అమ్ముడే అనే విషయం కేసీఆర్‌కు చెప్పాలని పిలుపునిచ్చారు. ‘ఏడు తారీకున ప్రమాణస్వీకారం చేస్తే ఆ భయానికి మీ నాన్న బొక్కలు విరిగిన విషయం గుర్తుపెట్టుకో’ అని కేటీఆర్‌కు సూచించారు. కారు షెడ్డుకు పోయిందని పొంకణాలు చెప్తున్న కేటీఆర్‌ను, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని పిట్టల దొరలా మాట్లాడుతున్న కేసీఆర్‌ను పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని రేవంత్ రెడ్డి అన్నారు.

ఆనాడు ఎంపీగా అభివృద్ధిని పట్టించుకోని కేసీఆర్‌
2009 కరీంనగర్‌లో ప్రజలు బండ కేసి కొట్టి, తరిమి కొడితే పారిపోయి పాలమూరుకు వలసవచ్చిన కేసీఆర్‌.. ఇక్కడి నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జెండా.. ఎజెండాలు పక్కన పెట్టి జిల్లాకు చెందిన విఠలరావును కాదని కేసీఆర్‌కు ఓటు వేసి పాలమూరు ప్రజలు పార్లమెంటుకు పంపారని, అయినా ఇక్కడ అభివృద్ధిని కేసీఆర్‌ ఆనాడు పట్టించుకోలేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పాలమూరు జిల్లాలో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయిందని అన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత పదేళ్లు కేసీఆర్‌ అధికారంలో ఉంటే పాలమూరును దగా చేసారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్ళు తెలంగాణ గోస పడిందని, కేసీఆర్‌ పదేళ్ల హయాంలో కూడా మార్పు రాలేదని చెప్పారు.

ప్రాజెక్టుల నిర్మాణంలో కేసీఆర్‌ విఫలం
కల్వకుర్తి, పాలమూరు ప్రాజెక్టు, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంలో కేసీఆర్‌ విఫలమయ్యారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బడుగు, బలహీన, గిరిజన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్‌ మాత్రం ఆనందంగా పదేళ్లు పాలన చేశారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పాలమూరు యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుంటారని అనుకుంటే పదేళ్ల పాలనలో కేసీఆర్‌ ఇక్కడ పంతుళ్ళ నియామకాలు చేపట్టలేదని ఆరోపించారు.

ఐదేళ్లు నోరెత్తని బీఆరెస్‌ ఎంపీ
పాలమూరు అభివృద్ధిని పట్టించుకోకుండా మళ్ళీ ఓట్ల కోసం పళ్లికిలించుకుంటూ వస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. మళ్ళీ గెలిచి పార్లమెంట్ లో కూర్చుని నిద్ర పోవాలని అనుకుంటున్నారన్నారు. ‘ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి వ్యక్తి మంచోడే.. నాకు తెలిసినోడే. కానీ ఐదేళ్లు పార్లమెంటులో నోరు ఎత్తలేదు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అడగలేదు. శ్రీనివాస్ రెడ్డి మంచానికి పడ్డాడు. లేవలేక పోతున్నారు. మళ్ళీ కేసీఆర్‌ పంపారు.. ఈ పిల్లగాడు ఐదేళ్లు చదివిండు.. పరీక్షలు రాసేందు వచ్చారు.. కూర్చుంటే లెవ్వనిక రాదు.. మాట్లాడం రాదు’ అంటూ బీఆరెస్‌ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ‘వంద రోజుల్లో ఏమి చేశారని పిట్టల దొర అంటున్నాడు. 100 రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. కట్టెల పొయ్యి నుంచి విముక్తి కల్పించాం. సిలిండర్ ధర మోదీ 1200 చేస్తే తెలంగాణ అడ్డబిడ్డల కోసం 500లకే మేం ఇస్తున్నాం’ అని చెప్పారు.

స్వయం సహాయ సంఘాల నిర్వీర్యం
బీఆరెస్‌ హయాంలో పదేళ్లు స్వయం సహాయక సంఘాలను నిర్వీర్యం చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. బీసీ జనాభా లెక్కలు వేస్తున్నామని, అందులో ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’కు మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని వెల్లడించారు. అలాగే ఆగస్టు 15 లోగా ముదిరాజ్‌లకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చారు. పాలమూరు జిల్లాకు వైద్య, ఇంజినీరింగ్, నర్సింగ్, జూనియర్, డిగ్రీ, కళాశాలు, 10 వేల కోట్లతో అభివృద్ధి చేశామని ముఖ్యమంత్రి వివరించారు. రూ.30 వేల కోట్లు కేంద్రం నుంచి రావాలని కొట్లాడుతున్నామని తెలిపారు.

గడీల నేతలను తరిమికొట్టాలి
గద్వాల గడీ నుంచి దొరసాని బయలుదేరిందని బీజేపీ అభ్యర్థి డీకే అరుణనుద్దేశించి రేవంత్‌ ఎద్దేవా చేశారు. గద్వాల దొరలముందు, గజ్వేల్‌ ఫామ్‌హౌస్‌ దొరల ముందు బానిసలుగా బతకదలుచుకోలేదని స్పష్టం చేశారు. మీకాళ్ళ కింద చెప్పొ.. మీ నెత్తిపై గొడుగో.. లేకుంటే మీ చేతిలో చురకత్తిలా మారి.. మమ్మల్ని మేం చంపుకొంటామని కేసీఆర్‌ అనుకుంటున్నారని, మన శవాలపై నడుచుకుంటూ వెళ్లి ఓట్లు దండుకుని పార్లమెంటులో అడుగు పెట్టాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే రెండు స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ‘ఆకాశంలో చందమామను అడగటం లేదు.. మీ ఆస్తులు అడగటం లేదు.. ఒక్క ఓటు మాత్రమే అడుగుతున్న మీ బిడ్డగా.. ఇంతవరకు ఎవరెవరికో ఓటు వేశారు.. ఇప్పుడు మాకు వెయ్యండి.. పాలమూరు బిడ్డను ఇక్కడే పుట్టా.. ఇక్కడి మట్టిలో కలిసిపోతా.. నా తరఫున పార్లమెంట్‌లో పోరాడే వ్యక్తిని మనం పార్లమెంట్‌కు పంపుదాం’ అని ఓటర్లను కోరారు. డీకే అరుణ పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగారా? అని ప్రశ్నించారు. ఆమె గెలిస్తే గడీలలో ఉన్న వారు బాగుపడతారు కానీ గల్లీల్లో ఉన్నవారు బాగుపడరని రేవంత్ అన్నారు.

మాదిగల వర్గీకరణ కోసం పోరాడుతాం :
ఎన్నో ఏళ్ళ నుంచి వర్గీకరణ చేయాలని మాదిగలు పోరాడుతుంటే బీఆరెస్‌, బీజేపీ పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. గతంలో అసెంబ్లీలో వర్గీకరణ కోసం ఎమ్మెల్యేలుగా ఉన్న నేను, సంపత్ కుమార్ కలిసి కేసీఆర్‌ దగ్గర పట్టుబట్టి వర్గీకరణ బిల్లు పెట్టిస్తే పదేళ్ల కాలంలో దానిని పెండింగ్‌లో ఉంచారని పేర్కొన్నారు. గతంలో పార్లమెంట్, సుప్రీం కోర్లుల్లో వర్గీకరణపై పోరాటం చేశామని, మళ్ళీ ఈ వర్గీకరణ కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వర్గీకరణ బిల్లు పార్లమెంటులో పెట్టేవరకు మాదిగల తరపున తాము పోరాడతామని హామీ ఇచ్చారు. వర్గీకరణ విషయంలో బీఆరెస్‌, బీజేపీ దొందూ దొందేనన్న రేవంత్‌రెడ్డి.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్టీలనూ బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. కార్నర్ మీటింగ్ అనంతరం కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వంశీచంద్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రవికి అందజేశారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు బయలు దేరి వెళ్లారు. ఉదయం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన పాలమూరుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరి, అనిరుధ్‌ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శంకర్, పర్ణిక రెడ్డి, నాగర్ కర్నూల్ సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి, ఢిల్లీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఆనంద్ గౌడ్, ఒబేదుల్లా కొత్వాల్, మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కల్వకుర్తి, పాలమూరు ప్రాజెక్టు, నెట్టం పాడు, బీమా కోయిలసాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం లో కేసీఆర్‌ విఫలం చెందారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. బడుగు, బలహీన, గిరిజన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రాజెక్టు లు పూర్తి చేయక పోవడం తో రైతులు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్‌ మాత్రం ఆనందంగా పదేళ్లు పాలన చేశారని సీఎం అన్నారు.కాంగ్రెస్ హయాంలో పాలమూరు యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు.పేద విద్యార్థులు ఉన్నతగా చదువులు చదువుకుంటారని అనుకుంటే పదేళ్ల పాలన లో కేసీఆర్‌ ఇక్కడ పంతుళ్ళ నియామకాలు చేపట్టాలేదన్నారు.

పాలమూరు అభివృద్ధి ని పట్టించుకోకుండా మళ్ళీ ఓట్ల కోసం పళ్ళు ఇకిలించుకుంటూ వస్తున్నారని మళ్ళీ గెలిచి పార్లమెంట్ లో కూర్చుని నిద్ర పోవాలని అనుకుంటున్నారన్నారు. ఇక్కడి నుంచి ఎంపీ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి వ్యక్తి మంచోడే… నాకు తెలిసినోడే.. కాని ఐదేళ్లు లో పార్లమెంట్ లో నోరు ఎత్తలేదు… పాలమూరు ప్రాజెక్టు జాతీయ హోదా అడగలేదు… శ్రీనివాస్ రెడ్డి మంచనికి పడ్డాడు. .లేవలేక పోతున్నారు. మళ్ళీ కేసీఆర్‌ పంపారు. ఈ పిల్ల గాడు ఐదేళ్లు చదివిండు..పరీక్ష లు రాసేందు వచ్చారు..కూర్చుంటే లెవ్వనిక రాదు..మాట్లాడం రాదని మన్నే శ్రీనివాస్ రెడ్డి నిపై విమర్శలు గుప్పించారు.వంద రోజుల్లో ఏమి చేశారని పిట్టల దొర అంటున్నాడు.. 100 రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం , కట్టెల పొయ్యి నుంచి విముక్తి… సిలిండర్ ధర మోదీ 1200 చేస్తే తెలంగాణ అడ్డబిడ్డ ల కోసం 500 లకే గస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు.

పదేళ్లు స్వయం సహాయక సంఘాలను నిర్వీర్యం చేశారని, కాని కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన మూడు నెలల్లో 30 వెల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. బీసీ జనాబా లెక్కలు వేస్తున్నామని,అందులో ముదిరాజ్ లను బీసీ డి నుంచి ఏ కు మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నాదన్నారు.అలాగే ఆగస్టు 15 లోగా ముదిరాజ్ లకు మంత్రి వర్గం లో చోటు దక్కుతుందని రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చారు. పాలమూరు జిల్లా కు వైద్య, ఇంజనీరింగ్, నర్సింగ్, జూనియర్, డిగ్రీ, కళాశాలు, 10 వేల కోట్ల లో అభివృద్ధి చేశామన్నారు.

రూ. 30 వేల కోట్లు కేంద్రం నుంచి రావాలని కొట్లాడుతున్నామన్నారు. గద్వాల గడి నుంచి దొరసాని బయలుదేరిందని,గద్వాల దొరలకైనా, గజ్వెల్ ఫార్మ్ హౌస్ దొరల ముందు బానిసలుగా బతక దలుచుకోలేదన్నారు..మీకాళ్ళ కింద చెప్పొ.. మీ నెత్తి పై గోడుగో.. లేకుంటే మీ చేతిలో చురకత్తి ల మారి..మాకు మేమూ చంపు కుంటామని కేసీఆర్ అనుకుంటున్నారని, మా శవాల పై నడుచు కుంటూ వెళ్లి ఓట్లు దండుకుని పార్లమెంట్ లో అడుగుపెట్టాలని చూస్తున్నారన్నారు.

జిల్లా అభివృద్ధి చెందాలంటే రెండు స్థానాలు గెలవాలని, ఆకాశం లో చందమామను అడగడం లేదు.. మీ ఆస్తులు అడగడం లేదు.. ఒక్క ఓటు మాత్రమే అడుగుతున్న మీ బిడ్డగా…ఇంతవరకు ఎవరెవరికో ఓటు వేశారు… ఇప్పుడు మాకు వెయ్యండి.. పాలమూరు బిడ్డ ను ఇక్కడే పూట్టా.. ఇక్కడి మట్టిలో కలిసిపోతా,… నా తరపున పార్లమెంట్ లో పోరాడే వ్యక్తి ని మనం పార్లమెంట్ పంపుదాం… అరుణమ్మ పాలమూరు ప్రాజెక్టు కు జాతీయ హోదా అడిగిందా, ఆమె గెలుస్తే గాడిలలో ఉన్న వారు బాగుపడతారు కాని గల్లీల్లో ఉన్నవారు బాగుపడరని రేవంత్ అన్నారు. వంద రోజుల్లో పాలన పై కేసీఆర్‌ పిట్టల దొరల మాట్లాడుతున్నారని, ఢిల్లీలో మోదీ ని చూసాము ఇక్కడ గల్లీలో లో కేసీఆర్‌ అనే కేడి ని చూసాము,ఈ గడ్డమీద జెండా ఎగిరేది మనమే అని రేవంత్ రెడ్డి అన్నారు.

మాదిగల వర్గీకరణ కోసం పోరాడుతాం

ఎన్నో ఏళ్ళ నుంచి వర్గీకరణ చేయాలని మాదిగలు పోరాడుతుంటే బీ ఆర్ ఎస్, బీజేపీ పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి అన్నారు. గతం లో అసెంబ్లీ లో వర్గీకరణ కోసం ఎమ్మెల్యే లుగా ఉన్న నేను, సంపత్ కుమార్ కలిసి కేసీఆర్‌ను పట్టుబట్టి వర్గీకరణ బిల్లు పెట్టిస్తే పదేళ్ల కాలంలో ఏ బిల్లు పెండింగ్ లో ఉంచారని ఆయన పేర్కొన్నారు. గతం లో పార్లమెంట్, సుప్రీం కోర్ట్ లో వర్గీకరణ పై పోరాటం చేశామని, మళ్ళీ ఈ వర్గీకరణ కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి అన్నారు. వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో పెట్టేవరకు మాదిగల తరపున మేమూ పోరాడతామన్నారు.

మీరు కొట్లాడ అవసరం లేదు.. మీకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుందన్నారు. వర్గీకరణ విషయం లో బీ ఆర్ ఎస్, బీజేపీ దొందు దొందే అని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పార్టీ లను బొంద పెట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కార్నర్ మీటింగ్ అనంతరం కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వంశీచంద్ రెడ్డి నామినేషన్ పత్రాలు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రవి అందజేశారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో రేవంత్ రెడ్డి బయలు దేరి వెళ్లారు. ఉదయం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గన పాలమూరు కు వచ్చారు.

Latest News