Site icon vidhaatha

ప్రజాసేవకు మించిన తృప్తి లేదు

ప్రజాదర్భార్‌పై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్‌



విధాత : ప్రజా సేవకు మించిన తృప్తి ఏముంటుందని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. శుక్రవారం జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో తొలిసారిగా నిర్వహించిన ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై వారిచ్చిన ఆర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను ఓపిగ్గా విన్నారు.

  

తొలి ప్రజాదర్బార్‌పై రేవంత్ రెడ్డి ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ జనం కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ తొలి ప్రజా దర్బార్ సాగిందన్నారు. జనం నుండి ఎదిగి..ఆ జనం గుండె చప్పుడు విని వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించి తృప్తి ఏముంటుందంటూ ట్వీట్ చేశారు. ప్రజాదర్బార్‌లో తను ప్రజల నుంచి వినతులు తీసుకుంటున్న వీడియోను కూడా ఆయన పోస్టు చేశారు

Exit mobile version