Site icon vidhaatha

CM Revanth Reddy: ఈ నెల 16న రైతులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి!

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16న రైతులతో ముఖాముఖి కానున్నారు. 16వ తేదీన వ్యవసాయ యూనివర్సిటీలో జరగనున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమానికి సీఎం రేవంత్‌‌ రెడ్డి హాజరవుతారు. ఇక్కడి నుంచి రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రంలోని అన్ని రైతు నేస్తం కేంద్రాల్లో ఈ ముఖాముఖిని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సీఎస్ రామకృష్ణ ఆదేశించారు. ప్రతి ప్రాంతం నుంచి కనీసం 250 మంది రైతులు హాజరయ్యేలా చూసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్లకు సూచించారు. అలాగే ప్రస్తుతం ఉన్న 500రైతు నేస్తం కేంద్రాలకు తోడుగా అదనంగా మరో 1000రైతు నేస్తం కేంద్రాల్లో వీడియో కాన్ఫరెన్స్ అందుబాటులోకి తేవాలని సీఎస్ ఆదేశించారు.

వానకాలం పంటల సాగు ప్రారంభమైన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరవ్వడంతో పాటు ఈనెలాఖరు కల్లా రైతు భరోసాను పంపిణి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. జూలైలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పల్లెల్లో మెజార్టీగా ఉండే రైతాంగానికి చేరువయ్యేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

Exit mobile version