సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న సీఎం రేవంత్

సీఎం రేవంత్ మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకొని 68 కేజీల బంగారం సమర్పించారు. డిజిటల్ ప్లాన్ విడుదల చేసి రూ.150 కోట్లు పనులు ప్రారంభించారు.

cm-revanth-reddy-visits-medaram-jathara-offers-prayers-and-launches-development-works

విధాత ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మలను బుధవారం సందర్శించారు. ములుగు జిల్లా పర్యటన కు వచ్చిన సందర్భంగా అమ్మవార్లకు 68 కేజీలనిలువెత్తు బంగారం సమర్పించి, శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల, పగిడిద రాజు గోవిందరాజుల దర్శనం చేసుకున్నారు.

ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, కొండ సురేఖ,అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్, వరంగల్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు,రేవూరి ప్రకాష్ రెడ్డి, భూక్య మురళి నాయక్, తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మంత్రి సీతక్క మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ పూజారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమ్మవార్ల ఆశీర్వాదాలు, ప్రసాదాలు అందించారు.

అక్కడి నుంచి ఆయన మేడారంలో అమలు చేయనున్న డిజిటల్ ప్లాన్ ను పరిశీలించి విడుదల చేయనున్నారు. అనంతరం జాతర సందర్భంగా విడుదల చేసిన రూ. 150 కోట్ల రూపాయలతో చేపట్టే పనులను ప్రారంభించనున్నారు. ఆదివాసి ఆచార సంప్రదాయాల ప్రకారం, పూజారుల సూచనలు మేరకే మేడారంభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం అధికారులతో జాతర పనుల పై సమీక్షిస్తారు. తదుపరి జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతారు. రేవంత్ రాక సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు పార్టీ శ్రేణులను మంత్రి సీతక్క భారీగా తరలించారు.