Site icon vidhaatha

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హాస్య బ్రహ్మ బ్రహ్మానందం

విధాత, తిరుమల : ప్రముఖ తెలుగు సినిమా హాస్య నటుడు బ్రహ్మానందం ఆదివారం ఉదయం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం తిరుమల చేరుకున్న బ్రహ్మానందం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలో రంగనాయకుల మండపంలో అర్చకులు ఆయనకు ఆశీర్వచనం పలికారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం ఆలయం నుంచి బయటికి వచ్చిన బ్రహ్మా నందంను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీలు దిగారు.

Exit mobile version