Congress | BRS వైఫల్యాలపై.. ప్రజా కోర్టులు: రేవంత్ రెడ్డి

Congress | తిరగబడదాం.. తరిమికొడదాం అదే కాంగ్రెస్‌ ప్రచార నినాదం పార్టీ ప్రజాకోర్టులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విధాత: సీఎం కేసీఆర్, కుటుంబ సభ్యుల అవినీతిపైన, తప్పిదాలపైన కాంగ్రెస్ పార్టీ ప్రజాకోర్టులను నిర్వహించి చార్జీషీట్లు వేయడం ద్వారా వారి అవినీతిని జనంలోకి తీసుకెలుతుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం బోయినపల్లిలో గాంధీ ఐడియాలజీ సెంటర్ లో కాంగ్రెస్ నిర్వహించిన ప్రజాకోర్టు కార్యక్రమంలో తిరుగబడుదాం… తరిమికొడుదాం అన్న నినాదంతో తోడు దొంగలు అన్న టైటిల్‌తో […]

  • Publish Date - August 12, 2023 / 03:37 PM IST

Congress |

  • తిరగబడదాం.. తరిమికొడదాం
  • అదే కాంగ్రెస్‌ ప్రచార నినాదం
  • పార్టీ ప్రజాకోర్టులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

విధాత: సీఎం కేసీఆర్, కుటుంబ సభ్యుల అవినీతిపైన, తప్పిదాలపైన కాంగ్రెస్ పార్టీ ప్రజాకోర్టులను నిర్వహించి చార్జీషీట్లు వేయడం ద్వారా వారి అవినీతిని జనంలోకి తీసుకెలుతుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం బోయినపల్లిలో గాంధీ ఐడియాలజీ సెంటర్ లో కాంగ్రెస్ నిర్వహించిన ప్రజాకోర్టు కార్యక్రమంలో తిరుగబడుదాం… తరిమికొడుదాం అన్న నినాదంతో తోడు దొంగలు అన్న టైటిల్‌తో బీఆరెస్‌, బీజేపీలపై రూపొందించిన ప్రజా చార్జిషీట్‌ను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్‌రావు ఠాక్రేతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతు ప్రజాకోర్టు అంతిమ లక్ష్యం తెలంగాణ ప్రజాకంటకుడిగా మారిన సీఎం కేసీఆర్ పాలనపై తిరుగబడదాం..తరిమికొడదాం అన్న ప్రచారంతో ప్రజలను చైతన్యవంతం చేయడమేనన్నారు. ప్రజాకవి కాళోజీ చెప్పినట్లుగా సొంత వాళ్లే మోసం చేస్తే వాళ్లను ఏ విధంగా శిక్షించాలో ప్రజలందరికి వివరించి, ప్రజాకంటక కేసీఆర్ ను పొలిమేరల దాకా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాకోర్టులను తండాలు, మారుమూల పల్లెల్లో కూడా నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు, ప్రజలను కోరుతున్నామన్నారు.

విద్యార్థి, ఉద్యమకారుల ఆత్మబలిదానాలు గౌరవించి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలకు విలువ ఇచ్చి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని కేసీఆర్ చెప్పిండని, తొమ్మిదేళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజల హక్కులను కాలరాశాడన్నారు.

రాజులను, నియంతలను మరిపించేలా ప్రజలపై కేసీఆర్ దాడులు చేస్తున్నారని, కేసీఆర్ ను శిక్షించేందుకే ఈ ప్రజాకోర్టులో ప్రజా చార్జ్ షీట్ లు పెడుతున్నామని, ఈ ప్రజాకోర్టులో ప్రొఫెసర్ కంచె ఐలయ్య తీర్పు చెబుతారన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం భూతద్దం పెట్టి చూసినా కనిపించడం లేదన్నారు. అందుకోసమే ఈ ప్రజా కోర్టును ఏర్పాటు చేసామన్నారు.

సీఎం కేసీఆర్ దోపిడితో పాటు, బీఆరెస్ ఎమ్మెల్యేల అవినీతిపైనకూడా చార్జ్ షీట్ లు విడుదల చేయాలని రేవంత్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. నెల రోజుల పాటు గ్రామ గ్రామాన బీఆరెస్‌ వైఫల్యాలపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 12,000 గ్రామాల్లో, 3,000 డివిజన్ స్థాయిలలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు వెళ్లి 75 లక్షల కుటుంబాలను పార్టీ శ్రేణులు కలుస్తాయన్నారు.

తిరుగబడుదాం..తరిమికొడుదాం ప్రచారానికి మద్దతుగా 7661 899 899 ఫోన్ నంబర్ తో మిస్డ్ కాల్ ప్రోగ్రాంను కాంగ్రెస్ చేపట్టిందన్నారు. ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫ్యలాలను ఎండగట్టేందుకు పోస్ట్ కార్డుల కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. అంతకుముందు ప్రజాకోర్టు వేదికపై కాంగ్రెస్ నేతలంతా గద్దర్‌కు నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ సెక్రెటరీలు, సంపత్ కుమార్, వంశీ చంద్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, బలరాం నాయక్, సీతక్క, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

Latest News