- మళ్లీ పెండింగ్‌లోనే ఖమ్మం, భువనగిరిలు
విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలోని పార్లమెంటు ఎన్నికల అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి మరో 9 మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ మంగళవారం రాత్రి వెలువడే అవకాశముందని తెలుస్తుంది. సీడబ్ల్యుసీ సమావేశం అనంతరం సీఈసీ తెలంగాణ అభ్యర్థులను ప్రకటించనున్నారు. అభ్యర్థుల ఖరారుపై చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఢిల్లీలోనే ఉన్నారు.
ఢిల్లీ మీడియా, ఆ పార్టీ వర్గాల కథనం మేరకు తొమ్మిది స్థానాలలో అభ్యర్థులు ఖరారైనట్లుగా, మరోసారి ఖమ్మం, భువనగిరి పెండింగ్‌లో ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది. ఖరారుకానున్న స్థానాల్లో మెదక్ నుంచి నీలం మధు, హైదరాబాద్ షానావాజ్, సికింద్రాబాద్ దానం నాగేందర్, మల్కాజిగిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, చేవెళ్ల రంజిత్ రెడ్డి, వరంగల్ పసునూరి దయాకర్, పెద్దపల్లికి గడ్డం వంశి, కరీంనగర్ ప్రవీణ్‌రెడ్డి, నిజామాబాద్ టీ.జీవన్‌రెడ్డిలను అభ్యర్థులుగా ప్రకటించనున్నట్లుగా సమాచారం.
భువగిరి, ఖమ్మం, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ స్థానాలను పెండింగ్‌లో పెట్టవచ్చని సమాచారం. భువనగిరి నుంచి బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ,అదిలాబాద్ నుంచి డా.సుమలత, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జలు, ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, నాగర్ కర్నూల్‌లో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, సీనియర్ నేత మల్లు రవిలు పోటీ పడుతున్నారు.