Site icon vidhaatha

Congress | చైనాతో ఒప్పందం కుదిరిందా?: జైరాం రమేశ్‌

Congress

న్యూఢిల్లీ: సరిహద్దు వివాదం విషయంలో భారతదేశానికి, చైనాకు మధ్య ఏదైనా ఒప్పందం కుదిరిందా? అన్న సందేహాన్ని కాంగ్రెస్‌ పార్టీ వ్యక్తం చేసింది. బాలిలో గత సంవత్సరం నవంబర్‌లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్‌ మధ్య జరిగిన సమావేశంలో ఆహ్లాదకరంగా చర్యలు జరిగాయన్న విదేశాంగ శాఖ మంత్రి వ్యాఖ్యలపై శుక్రవారం కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ స్పందించారు.

‘లద్దాఖ్‌లోని డెప్సాంగ్‌, డెమ్‌చోక్‌ నుంచి చైనా దళాలు వెనుదిరిగి పోయాయా?’ అని ప్రశ్నించారు. బాలి సమావేశంలో ఆహ్లాదకరంగా చర్చలు సాగాయా? లేక దేశాన్ని అప్పగించే దిశగా చర్చలు సాగాయా? అని ఆయన నిలదీశారు.

Exit mobile version