Madhu Yashki | రుణ మాఫీ కాదు.. వడ్డీ మాఫీ

Madhu Yashki | విధాత: ఐదేళ్లుగా రుణమాఫీ చేయకుండా ఇప్పుడు చేస్తామని ప్రకటించడంతో కేవలం మిత్తి మాత్రమే మాఫీ అయిందని, అసలు రుణం అలాగే ఉందని కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపించింది. ఈ మేరకు శుక్రవారం పీసీసీ ప్రచార కమిటీ సమావేశం గాంధీభవన్ లో జరిగింది. ఈ సమావేశంలో బీఆరెస్ తీరుపై పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తామని ప్రకటించారు. ప్రచార కమిటీ సమావేశం ముగిసిన తరవాత చైర్మన్ మధు యాష్కీ మీడియాతో మాట్లాడుతూ ఈనెల 6న గాంధీ ఐడియాలోజి […]

  • Publish Date - August 4, 2023 / 02:00 AM IST

Madhu Yashki |

విధాత: ఐదేళ్లుగా రుణమాఫీ చేయకుండా ఇప్పుడు చేస్తామని ప్రకటించడంతో కేవలం మిత్తి మాత్రమే మాఫీ అయిందని, అసలు రుణం అలాగే ఉందని కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపించింది. ఈ మేరకు శుక్రవారం పీసీసీ ప్రచార కమిటీ సమావేశం గాంధీభవన్ లో జరిగింది. ఈ సమావేశంలో బీఆరెస్ తీరుపై పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తామని ప్రకటించారు.

ప్రచార కమిటీ సమావేశం ముగిసిన తరవాత చైర్మన్ మధు యాష్కీ మీడియాతో మాట్లాడుతూ ఈనెల 6న గాంధీ ఐడియాలోజి సెంటర్ లో కూడా మీటింగ్ ఉంటుందని తెలిపారు. శనివారం హైదరాబాద్ కు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ వస్తున్నారన్నారు.

పార్లమెంట్ అడ్వైజరీ సభ్యులు కూడా వస్తారని తెలిపారు. కేసీఆర్, మోడీ తెరవెనుక తెరముందు ఎట్లా అనేది చూపిస్తామన్నారు. తెలంగాణలో దోపిడీ జరుగుతోందని, అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాలకు ఖర్చు చేస్తున్నారన్నారు. కేంద్ర విచారణ సంస్థలను ఉసిగొల్పి కాంగ్రెస్ నేతలను సానుభూతి పరులను వేధిస్తున్నారని ఆరోపించారు. మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ పార్లమెంట్లో ఎందుకు మాట్లాడం లేదన్నారు.

రాహుల్ విషయంలో సత్యం గెలిచిందన్నారు. పీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బీఆరెస్ ఎన్నికల హామీలు, అమలు చేయని తీరును జనాల్లోకి తీసుకెళతామన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. వారిని ఏ విధంగా కాపాడు కోవాలని అనేదానిపై చర్చ చేశామని తెలిపారు. కాంగ్రెస్ సానుభూతి పరులను కూడా కాపాడుకుంటా మన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కష్టపడి పని చెయ్యాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Latest News