COVID-19 | దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. గత 24 గంట్లో కొత్త కేసులు 38శాతం పెరిగాయి. మంగళవారం 7వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డవగా.. బుధవారం 10,542 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. క్రియాశీల కేసుల సంఖ్య సైతం భారీగా పెరుగుతున్నది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 63,562కి చేరింది. మరో వైపు మహమ్మారి కారణంఆ 38 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త నమోదైన కేసులదో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,48,45,401కి చేరుకుంది.
ఇప్పటి వరకు మహమ్మారి కారణంగా 5,31,190కి పెరిగింది. వైరస్ నుంచి 4,42,50,649 మంది బాధితులు కోలుకున్నారు. రికవరీ రేటు 98.67శాతం ఉండగా.. మరణాల రేటు 1.18శాతంగా ఉన్నది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.39శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 5.14శాతంగా ఉందని ఆరోగ్యశాఖ వివరించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 220.66 కోట్ల డోసులు వేసినట్లు తెలిపింది. దేశంలో వరుసగా కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతున్నది. తెలంగాణలో కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో సర్కారు అప్రమత్తమైంది. బుధవారం నుంచి బూస్టర్ డోసులు వేసేందుకు సిద్ధమైంది.