Site icon vidhaatha

Viral Video | గాయ‌ప‌డిన గేదె.. హెలికాప్ట‌ర్ ద్వారా ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

Viral Video | ప‌శువుల‌కు ఏదైనా గాయమైనా, అస్వ‌స్థ‌త‌కు గురైన ప‌శువుల డాక్ట‌ర్‌ను పిలిపించి చూపిస్తాం. లేదంటే ప‌శువుల ద‌వ‌ఖానాకే త‌ర‌లిస్తాం. అయితే ఓ గేదె గాయ‌ప‌డ‌టంతో.. దాన్ని ఆస్ప‌త్రికి ఏకంగా హెలికాప్ట‌ర్ ద్వారా త‌ర‌లించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

స్విట్జ‌ర్లాండ్‌లోని యేవోలేన్ అనే గ్రామ స‌మీపంలోని కొండ ప్రాంతానికి గేదెలు మేత మేసేందుకు వెళ్లాయి. అక్క‌డ ప‌శువుల మ‌ధ్య చోటు చేసుకున్న ఘ‌ర్ష‌ణ‌లో ఓ గేదె తీవ్రంగా గాయ‌ప‌డింది. దాని కాలు విరిగి పోయింది. దీంతో గేదె ముందుకు క‌ద‌ల్లేని ప‌రిస్థితి నెల‌కొంది.

ఇక ఆ బ‌ర్రెను ఆస్ప‌త్రికి త‌ర‌లించేందుకు ఏకంగా హెలికాప్ట‌ర్‌ను వినియోగించారు. గేదెకు బ‌ల‌మైన తాళ్ల‌ను క‌ట్టి.. ఆ తాళ్ల‌ను హెలికాప్ట‌ర్‌కు క‌ట్టేశారు. అలా గేదెను హెలికాప్ట‌ర్ సాయంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Exit mobile version