Balagam | ‘బలగం’ మొగిలికి దళితబంధు మంజూరు

Balagam | మంజూరు పత్రాలను అందించిన కలెక్టర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్​ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు మంగళవారం దళిత బంధు పథకం మంజూరు చేశారు. దళిత బంధు పథకం మంజూరు పత్రాలను వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అందజేశారు. ఇటీవల విడుదలైన బలగం సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మొగిలి కుటుంబానికి అండగా ఉంటామని స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ […]

  • Publish Date - May 16, 2023 / 09:04 AM IST

Balagam |

  • మంజూరు పత్రాలను అందించిన కలెక్టర్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్​ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు మంగళవారం దళిత బంధు పథకం మంజూరు చేశారు. దళిత బంధు పథకం మంజూరు పత్రాలను వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అందజేశారు.

ఇటీవల విడుదలైన బలగం సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మొగిలి కుటుంబానికి అండగా ఉంటామని స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ హామీ అమలులో భాగంగా దళితబంధు మంజూరు చేశారు.